రియల్ మీ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ జిటి 6 టీజర్ లతో హోరెత్తిస్తోంది. Realme GT6 స్మార్ట్ ఫోన్ ను AI పవర్ తో తీసుకువస్తున్నట్లు ఇప్పటి వరకూ టీజింగ్ చేసింది. ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క అతి కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్స్ తో కంపెనీ ఈ ఫోన్ పైన అంచనాలను మరింత పెంచింది. ఈ ఫోన్ యొక్క పీక్ పెర్ఫార్మెన్స్ ట్రయో గా చెబుతున్న మూడు కీలక వివరాలు రియల్ మీ ఈరోజు బయటపెట్టింది.
రియల్ మీ జిటి 6 స్మార్ట్ ఫోన్ ప్రోసెసర్, బ్యాటరీ మరియు కూలింగ్ టెక్ వివరాలు ఈరోజు రియల్ మీ బయటపెట్టింది. రియల్ మీ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్ మీ GT6 ని క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 తో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిప్ సెట్ Cortex-X4 అల్ట్రా లార్జ్ కోర్ సిస్టం కలిగిన 4nm ఫ్యాబ్రికేషన్ తో ఉంటుంది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా LPDDR5X ర్యామ్ మరియు వేగవంతమైన UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుందని రియల్ మీ కన్ఫర్మ్ చేసింది.
ఇక రెండవ కీలక ఫీచర్ ను చూస్తే, ఈ ఫోన్ కలిగి ఉన్న కూలింగ్ సిస్టం గురించి తెలిపింది. ఈ ఫోన్ ప్రపంచంలో అతిపెద్ద కూలింగ్ సిస్టం కలిగిన ఫోన్ గా నిలుస్తుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ లో 10014mm² డ్యూయల్ VC (వేపర్ ఛాంబర్) కూలింగ్ సిస్టం కలిగి ఉన్నట్లు టీజర్ నుండి వెల్లడించింది. అందుకే, ఈ ఫోన్ లో అత్యంత వేగంగా చల్లబరచ గల లార్జ్ కూలింగ్ సిస్టం ఉందని కంపెనీ గొప్పగా చెబుతోంది.
Also Read: iQOO Neo 9 Pro 5G పై జబర్దస్త్ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
ఇక మూడవ కీలకమైన ఫీచర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ మరియు ఛార్జింగ్ టెక్ గురించి తెలిపింది. రియల్ మీ జిటి 6 స్మార్ట్ ఫోన్ ను పెద్ద 5500 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ పెద్ద బ్యాటరీని సైతం అత్యంత వేగంగా ఛార్జ్ చేయగల 120W సూపర్ ఉక్ ఛార్జ్ టెక్ ఈ ఫోన్ లో ఉన్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది.
ఈ ఫోన్ లేటెస్ట్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ లో కర్వుడ్ డిస్ప్లే ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు జూన్ 13న రివీల్ చేస్తుందని రియల్ మీ తెలిపింది. అయితే, ఇదే టీజర్ పేజిలో ఈ ఫోన్ కెమెరా గురించి హింట్ ఇచ్చింది. అదేమిటంటే, ఈ ఫోన్ లో Sony ఫ్లాగ్ షిప్ అల్ట్రా నైట్ కెమెరా సిస్టం ఉన్నట్లు సూచిస్తోంది. ఈ ఫోన్ కెమెరా వివరాలు పూర్తిగా తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.