Realme P3 Ultra 5G with premium features launched under 25k price segment
Realme P3 Ultra 5G: రియల్ మీ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తున్న రియల్ మీ పి3 అల్ట్రా ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ లో వేగవంతమైన చిప్ సెట్ మరియు స్టన్నింగ్ కెమెరా కలిగి ఉంటుందని రియల్ మీ పేర్కొంది. ఈ రోజు విడుదలైన రియల్ మీ కొత్త ఫోన్ కంప్లీట్ ఫీచర్స్, ఆఫర్స్ మరియు ధర వివరాలు తెలుసుకోండి.
రియల్ మీ ఈ ఫోన్ ను రూ. 26,999 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ఈ ధరతో లాంచ్ అయ్యింది. 8GB + 128GB వేరియంట్ రూ. 27,999 ధరతో మరియు ఈ ఫోన్ యొక్క 12GB + 256GB వేరియంట్ ను రూ. 29,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ. 4,000 రూపాయల లిమిటెడ్ తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 22,999 ధరకే అందుకోవచ్చు. అలాగే, 12GB వేరియంట్ ను కేవలం రూ. 25,999 ధరకే అందుకోవచ్చు.
ఈ ఫోన్ వదతి సేల్ మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Realme.com, Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: Realme P3 5G: IP69 వాటర్ ప్రూఫ్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్.!
రియల్ మీ పి అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను సరికొత్త లూనార్ డిజైన్ తో అందించింది. ఇది చీకటి సమయంలో ఫోన్ వెనుక భాగం వెలిగేలా చేస్తుంది. అంతేకాదు, ఇందులో నానో లెథర్ మెటీరియల్ కలిగిన ఆప్షన్స్ కూడా అందించింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ మరియు 1.5K రిజల్యూషన్ కలిగిన AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు హై బ్రైట్నెస్ సపోర్ట్ తో పాటు BGMI 90fps సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను మీడియా టెక్ లేటెస్ట్ మరియు పవర్ ఫుల్ 5G చిప్ సెట్ Dimensity 8350 Ultra తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh టైటాన్ బ్యాటరీ మరియు 80W AI బైపాస్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఎప్పుడు చల్లగా ఉంచడానికి వీలుగా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది.
ఈ రియల్ మీ ఫోన్ వెనుక 4K వీడియోలను 60FPS వద్ద రికార్డ్ చేయగల 50MP SonyIMX 896 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే , ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో AI Camera ఫీచర్స్ ను కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఫోన్ IP66, IP66 మరియు IP69 రేటింగ్ తో హాట్ వాటర్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.