భారీ ఆఫర్స్ తో మొదలైన Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ సేల్.!

Updated on 25-Mar-2025
HIGHLIGHTS

Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ 60fps 4K సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వచ్చింది

ఈ ఫోన్ ను ఈరోజు రియల్ మీ అందించిన ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు

రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన మిడ్ రేంజ్ బీస్ట్ Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 60fps 4K సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా మరియు పవర్ ఫుల్ ప్రోసెసర్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ పై మొదటి సేల్ నుంచి భారీ ఆఫర్లు అందుకునే అవకాశం వుంది. మిడ్ రేంజ్ లో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు రియల్ మీ అందించిన ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Realme P3 Ultra 5G : ప్రైస్ & ఆఫర్స్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్స్ రేట్లు ఇక్కడ చూడవచ్చు.

8GB + 128GB వేరియంట్ ధర : రూ. 26,999

8GB + 256GB వేరియంట్ ధర : రూ. 27,999

12GB + 256GB వేరియంట్ ధర : రూ. 29,999

ఆఫర్లు:

ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప ఆఫర్లు కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకునే అవకాశం రియల్ మీ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై ఆల్ బ్యాంక్ కార్డ్స్ రూ. 3,000 డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 4,000 రూపాయల తక్కువ ధరకు అందుకోవచ్చు.

Realme P3 Ultra 5G : ఫీచర్స్

రియల్ మీ పి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఫాస్ట్ మీడియాటెక్ చిప్ సెట్ Dimensity 8350 Ultra తో పని చేస్తుందిల మరియు జతగా వరకు 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.83 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 60fps 4K సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP (Sony IMX896) మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ లో 16MP (Sony IMX480) సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్ లను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Flipkart Big deal: 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

ఈ ఫోన్ లో 6000 భారీ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఈ ఫోన్ IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :