Realme P3 Ultra 5G: బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ అందిస్తుందట.!

Realme P3 Ultra 5G: బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ అందిస్తుందట.!
HIGHLIGHTS

Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది

ఈ ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది

బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ అందిస్తుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది

Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది. గత నెలలో P3 Series ఫోన్ లను రియల్ మీ పరిచయం చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ అందిస్తుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.

Realme P3 Ultra 5G: ఫీచర్స్

రియల్ మీ పి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Realme P3 Ultra 5G: ఫీచర్స్

రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 8350 తో లాంచ్
చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ 800K+ AnTuTu స్కోర్ అందించే స్మార్ట్ ఫోన్స్ లభించే ప్రైస్ సెగ్మెంట్ లో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే అవుతుందని టీజింగ్ చేస్తోంది. ఎందుకంటే, ఈ ఫాలెన్ కలిగిన చిప్ సెట్ 14,50,000+ AnTuTu స్క్రీన్ అందిస్తుంది. అందుకే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ అని టీజింగ్ చేస్తోంది.

ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 12GB LPDDR5X ర్యామ్ మరియు UFS 3.1 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 80W AI బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఇక ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో, 50MP Sony IMX896 OIS మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 60FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా చాలా స్లీక్ గా ఉంటుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లోనే Dolby Atmos Soundbar అందుకోండి.!

రియల్ మీ పి3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కాస్మిక్ స్టార్ రింగ్ డిజైన్, నెప్ట్యూన్ బ్లూ మరియు ఓరియన్ రెడ్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ తో కూడా వస్తుంది. అంతేకాదు, 90FPS BGMI స్టేబుల్ గేమింగ్ కూడా ఆఫర్ చేస్తుందట.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo