Realme P3 5G: IP69 వాటర్ ప్రూఫ్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్.!

Realme P3 5G: IP69 వాటర్ ప్రూఫ్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్.!
HIGHLIGHTS

Realme P3 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ విడుదల చేసింది

ఈ ఫోన్ ను IP69 వాటర్ ప్రూఫ్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది

ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది

Realme P3 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను IP69 వాటర్ ప్రూఫ్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కొత్త చిప్ సెట్ మరియు సరికొత్త బ్యాక్ ప్యానల్ డిజైన్ తో కూడా కలిగి ఉంటుంది. ఈరోజే విడుదలైన ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Realme P3 5G: ధర

రియల్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్లలో అందించింది. ఇందులో బేసిక్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 16,999 ధరతో, 8GB + 128GB వేరియంట్ ను రూ. 17,999 మరియు 8GB + 256GB వేరియంట్ ను రూ. 19,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎర్లి బర్డ్ సేల్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ realme.com మరియు Flipkart నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్ పియా రూ. 2000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను రియల్ మీ లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Top QLED Tv Deal: ప్రముఖ జపనీస్ బ్రాండ్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Realme P3 5G: ఫీచర్స్

రియల్ మీ పి3 స్మార్ట్ ఫోన్ ను 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 90FPS BGMI సపోర్ట్ , 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు Pro-XDR సపోర్ట్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, గేమింగ్ కోసం GT Boost మరియు AI మోషన్ మరియు AI టచ్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది.

Realme P3 5G

ఈ ఫోన్ నాలో వెనుక 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియుయూ 16MP సెల్ఫీ కెమెరా వున్నాయి. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో లేని విధంగా IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా స్లీక్ మరియు కొత్త గ్రాఫిక్స్ కలిగిన బ్యాక్ ప్యానల్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo