విడుదల కంటే ముందే Realme P3 5G ఫోన్ ప్రైస్ రివీల్ చేసిన కంపెనీ.!

Realme P3 5G ప్రైస్ ఫోన్ విడుదల కంటే ముందే లీక్ అయ్యింది
ఇండియన్ మార్కెట్ లో గొప్ప పోటీదారుగా వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది
ఈ ఫోన్ ప్రైస్ తో సహా పూర్తి వివరాలు లిస్ట్ చేసింది
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme P3 5G ప్రైస్ ఫోన్ విడుదల కంటే ముందే లీక్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్, కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేసిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ప్రైస్ ను కూడా లీక్ చేసింది. అంటే, ఈ ఫోన్ యొక్క అన్ని వివరాలు లాంచ్ కంటే ముందే కంపెనీ బయటపెట్టింది. ఈ ఫోన్ టీజింగ్ వివరాలు మరియు ప్రైస్ చూస్తుంటే 15 వేల బడ్జెట్ లో సూపర్ డిజైన్ మరియు ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్ లో గొప్ప పోటీదారుగా వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
Realme P3 5G : లాంచ్ ప్రైస్
రియల్ మీ పి3 స్మార్ట్ ఫోన్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం Flipakrt అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఇదే వివరాలు ఇప్పటికీ డిస్ప్లే చేస్తోంది. అయితే, realme.com నుంచి మాత్రం ఈ ఫోన్ ప్రైస్ తో సహా పూర్తి వివరాలు లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ఆర్లి బర్ద్ సేల్ మార్చి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుందని కూడా అనౌన్స్ చేసింది.
Realme P3 5G : ప్రైస్
రియల్ మీ పి3 స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో అనౌన్స్ చేసింది. ఇందులో బేసిక్ 6GB+128 వేరియంట్ ను రూ. 16,999 ధరతో, 8GB+128 వేరియంట్ ను రూ. 17,999 ధరతో మరియు 8GB+256 వేరియంట్ ను రూ. 19,999 ధరతో అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది.
Also Read: Oppo F29 Series 5G: అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మరియు 300% నెట్వర్క్ బూస్ట్ తో వస్తుంది.!
రియల్ మీ P3 5G : ఫీచర్స్
ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Snapdragon 6 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద Pro-XDR AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90FPS BGMI గేమింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ GT Boost మరియు AI అల్ట్రా టచ్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ను భారీ 6000 mAh టైటాన్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో లాంచ్ చేస్తుంది.