Realme P2 Pro 5G: ఆకర్షణీయమైన డిజైన్ మరియు గొప్ప స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది.!

Realme P2 Pro 5G: ఆకర్షణీయమైన డిజైన్ మరియు గొప్ప స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది.!
HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ ను P2 సిరీస్ నుంచి లాంచ్ చేసింది

Realme P2 Pro 5G ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు గొప్ప స్టోరేజ్ తో లాంచ్ చేసింది

రియల్ మీ పి 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 21,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది

Realme P2 Pro 5G: రియల్ మీ ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ ను P2 సిరీస్ నుంచి లాంచ్ చేసింది. అదే రియల్ మీ పి2 ప్రో 5జి మరియు ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు గొప్ప స్టోరేజ్ తో లాంచ్ చేసింది. గత నెలలో రెండు కొత్త ఫోన్లు విడుదల చేసిన రియల్ మీ ఈ నెలలో కూడా మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. రియల్ మీ ఈరోజు లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ వివరంగా తెలుసుకోండి.

Realme P2 Pro 5G: ధర

రియల్ మీ పి 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 21,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 23,999 ధరతో, హై ఎండ్ (12GB + 512GB) వేరియంట్ ను రూ. 25,999 ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్

రియల్ మీ పి 2 ప్రో స్మార్ట్ ఫోన్ పై మంచి ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల దివాళి కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ ను దీపావళి ముందు కొనుగోలు చేసే యూజర్స్ కు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17 వ తేదీ ఈ ఫోన్ అర్లీ బర్ద్ సేల్ మొదలవుతుంది.

Also Read: BSNL: రూ. 150 కే నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్.!

Realme P2 Pro 5G: ఫీచర్స్

రియల్ మీ పి 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను 120 HZ రిఫ్రెష్ రేట్ కలిగిన కర్వుడ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు AI Eye ప్రొటక్షన్ ను కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఆకర్షణీయమైన బయో విజన్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 512 హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది.

Realme P2 Pro 5G Features

రియల్ మీ పి2 ప్రో 5జి ఫోన్ లో వెనుక సూపర్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 సెన్సార్ కలిగిన కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరాలో AI హైపర్ RAW అల్గారిథం, AI రిమూవల్ వంటి చాలా AI ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5200mAh బ్యాటరీ సెటప్ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo