Realme P1 Speed స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ మధ్యలో విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసిన రియల్ మీ, ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 26GB హెవీ ర్యామ్ ఫీచర్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రియల్ మీ పి 1 స్పీడ్ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 15 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గ ఎంచుకుంది. Flipakrt ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ డేట్ తో ఈ ఫోన్ కోసమా ప్రత్యేకమైన మైక్రో సైట్ పీజీ ని అందించింది.
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ P1 స్పీడ్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ బయటపెట్టింది. వాస్తవానికి, దాదాపు అన్ని ఫీచర్స్ ను ముందే వెల్లడించింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ సపోర్ట్ కలిగిన OLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Energy చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 26GB ర్యామ్ ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ సమయంలో ఈ ఫోన్ ను వేడెక్కకుండా త్వరగా చల్లబరచడానికి వీలుగా పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కూడా అందించింది.
Also Read: Samsung Galaxy S23 Ultra పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
ఇది మాత్రమే కాదు, గొప్ప గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ లో GT Mode సపోర్ట్ ను కూడా రియల్ మీ జత చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను లాంచ్ కంటే ముందే రియల్ మీ వెల్లడించే అవకాశం వుంది.