Realme P1 Speed స్మార్ట్ ఫోన్ ను 26GB ర్యామ్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ తో లాంచ్ అవుతోంది.!
Realme P1 Speed స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటపెట్టింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 26GB హెవీ ర్యామ్ ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
Realme P1 Speed స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ మధ్యలో విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసిన రియల్ మీ, ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా బయటపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 26GB హెవీ ర్యామ్ ఫీచర్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Realme P1 Speed ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్ మీ పి 1 స్పీడ్ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 15 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గ ఎంచుకుంది. Flipakrt ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ డేట్ తో ఈ ఫోన్ కోసమా ప్రత్యేకమైన మైక్రో సైట్ పీజీ ని అందించింది.
Realme P1 Speed ఎలాంటి ఫీచర్స్ తో వస్తోంది?
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ P1 స్పీడ్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ బయటపెట్టింది. వాస్తవానికి, దాదాపు అన్ని ఫీచర్స్ ను ముందే వెల్లడించింది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ సపోర్ట్ కలిగిన OLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Energy చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 26GB ర్యామ్ ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ సమయంలో ఈ ఫోన్ ను వేడెక్కకుండా త్వరగా చల్లబరచడానికి వీలుగా పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కూడా అందించింది.
Also Read: Samsung Galaxy S23 Ultra పై జబర్దస్త్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
ఇది మాత్రమే కాదు, గొప్ప గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ లో GT Mode సపోర్ట్ ను కూడా రియల్ మీ జత చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను లాంచ్ కంటే ముందే రియల్ మీ వెల్లడించే అవకాశం వుంది.