Realme P1 Pro 5G: రియల్ మి కొత్త P సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఇందులో రియల్ మి పి1 5G మరియు పి1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లలో P1 Pro 5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో Curved Display వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. రియల్ మి సరికొత్తగా విడుదల చేసిన రియల్ మి పి1 ప్రో 5జి టాప్ -5 ఫీచర్లు, ప్రైస్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.
రియల్ మి ఈ ఫోన్ ను రూ. 21,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB)రూ. 21,999 ధరతో మరియు (8GB + 256GB) వేరియంట్ రూ. 22,999 ధరతో వచ్చాయి.
ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను లాంఛ్ ఆఫర్ లో భాగంగా రియల్ మి అనౌన్స్ చేసింది. ICICI, HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల భారీ తగ్గింపు లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను 20 వేల ఋఒయల్ కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు.
ఈ ఫోన్ ఈరోజు యొక్క రెడ్ లిమిటెడ్ సేల్ ఏప్రిల్ 22వ్ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకూ జరుగుతుంది.
Also Read: Android 15: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ OS రిలీజ్ చేసిన గూగుల్.!
ఈ రియల్ మి కొత్త ఫోన్ 6.7 ఇంచ్ పరిమాణం కలిగిన curved AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు Pro-XDR టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి వుంది. ఇది HDR effects లను డిస్ప్లే కి జోడిస్తుంది.
రియల్ మి పి1 ప్రో స్మార్ట్ ఫోన్ Smart 5G కేపబిలిటీ కలిగిన Snapdragon 6 Gen 1 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Realme UI 5.0 సాఫ్ట్ వేర్ తో Android 14 OS జతగా మరింత లీనమైన మరియు వేగవంతమైన పనితీరును అందిస్తుందని రియల్ మి తెలిపింది.
రియల్ మి ఈ ఫోన్ ను 8 GB RAM ఫిజికల్ + 8 GB RAM అధనపు ర్యామ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 128 GB మరియు 256 GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లను అందించింది. అంటే, వేగంతమైన పనితీరుకు ఈ ఫీచర్ లను ఈ ఫోన్ తో జోడించింది.
ఈ ఫోన్ లో మంచి ఆకట్టుకునే కెమేరా సెటప్ అందించినట్లు రియల్ మి తెలిపింది. P1 Pro 5జి ఫోన్ లో వెనుక 50MP (Sony LYT 600) మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇది OIS మరియు EIS సపోర్ట్ లతో గొప్ప ఫోటోలను మరియు వీడియో లను అందిస్తుందని రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
ఈ రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది. ఇది టైప్ – C పోర్ట్ సపోర్ట్ వస్తుంది మరియు వేగంగా ఛార్జ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP54 రేటింగ్ తో Water Resistance గా ఉంటుందని కూడా రియల్ మి తెలిపింది.