Redmi Note 10 Pro 5G: రెడ్మి 5G ఫోన్ లాంచ్
Redmi Note 10 Pro 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్
మీడియా టెక్ డైమెన్సిటీ 700 5G చిప్ సెట్
Redmi Note 10 Series లో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ యాడ్ అయ్యింది. అయితే, ఈసారి 5G స్మార్ట్ ఫోన్ ను జతచేసింది షియోమి. ఈ సిరీస్ లో లేటెస్ట్ Redmi Note 10 Pro 5G ను ప్రకటించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఈ రెడ్మి నోట్ 10 ప్రో 5G మీడియా టెక్ డైమెన్సిటీ 700 5G చిప్ సెట్ తో వచ్చింది. అంతేకాదు, రెడ్మి నోట్ 10 ప్రో 5G లో 90Hz రిఫ్రెష్ రేట్ గల కొత్త రకమైన అడాప్టివ్ షింక్ డిస్ప్లే ని అందించింది. ఈ ఫోన్ పూర్తి ప్రత్యేకతలు క్రింద చూడవచ్చు.
Redmi Note 10 Pro 5G: ప్రత్యేకతలు
Redmi Note 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 6.5 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల అడాప్టివ్ షింక్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే, 30Hz/50Hz/60Hz/90Hz లలో వేరియబుల్ గా పనిచేస్తుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన డిస్ప్లే మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ని అందించింది.
ఈ ఫోన్ MediaTek Dimensity 700 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు Arm Mali-G57 MC2 GPU తో పనిచేస్తుంది. ఇది 4GB/6GB RAM మరియు 128GB వరకూ స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా MIUI 12 స్కిన్ పైన నడుస్తుంది.
ఇక కెమెరాల పరంగా, రెడ్మి నోట్ 10 ప్రో 5G వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 48MP మైన్ కెమెరాకి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 8 MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. NFC సపోర్ట్ మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కూడా వుంది.