Realme Narzo N55: బడ్జెట్ ధరలో 64MP AI కెమేరాతో లాంచ్ అయ్యింది.!

Updated on 13-Apr-2023
HIGHLIGHTS

రియల్ మి నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది

Realme Narzo N55 పేరుతో వచ్చిన స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో 64MP AI కెమేరాతో లాంచ్ అయ్యింది

రియల్ మి నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. Realme Narzo N55 పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో 64MP AI కెమేరాతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ సందర్భంగా గొప్ప అఫర్ లను కూడా రియల్ మి ప్రకటించింది. రియల్ మి నార్జో ఎన్55 స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఆఫర్లతో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. 

Realme Narzo N55: ధర మరియు లాంచ్ ఆఫర్లు

రియల్ మి నార్జో ఎన్55 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ చెయ్యబడింది. ఇందులో, బేసిక్ వేరియంట్ (4GB + 64GB) ధర రూ.10,999. రెండవ వేరియంట్ (6GB + 128GB ) ధర రూ.12,999. అయితే, ఈఫోన్ పైన కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా జతచేసింది. ఈ రేపు మధ్యాహ్నం 12 గంటలకి కంపెనీ ఈ ఫోన్ కోసం ఫ్లాష్ సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది. 

ఈ ఫోన్ ను రేపు ఫ్లాష్ సేల్ నుండి కొనేవారు కూపన్ అఫర్ ద్వారా 4GB వేరియంట్ పైన రూ.700 మరియు 6GB వేరియంట్ పైన రూ.1,000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు ICICI క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఈ ఫోన్ 4GB వేరియంట్ కొనేవారు రూ.500 మరియు 6GB వేరియంట్ కొనేవారు రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ను పొందవచ్చు.                    

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు Realme ఆన్లైన్ స్టోర్ నుండి జరగుతుంది. 

Realme Narzo N55: ప్రత్యేకతలు

రియల్ మి నార్జో ఎన్55 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.72 ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. రియల్ మి ఈ ఫోన్ ను మీడియాటెక్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో అందించింది. దీనికి జతగా 4GB/6GB RAM మరియు 64GB/128GB స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మెమొరీ కార్డ్ ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. 

ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వచ్చింది. ఈ రియర్ కెమేరా సెటప్ లో 64MP AI ప్రధాన సెన్సార్  వుంది. ఈ రియర్ కెమేరాతో 1080 పిక్సెల్ తో 60fps వీడియోలను చిత్రీకరించ వచ్చని రియల్ మి తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమేరా వుంది మరియు దీనితో సెల్ఫీలు, వీడీయో కాలింగ్ మరియు 1080 పిక్సెల్ తో 30fps వీడియో లను చిత్రీకరించని కంపెనీ చెబుతోంది. 

ఈ ఫోన్ ఇతర ఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ realme UI 4.0 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 7.89mm మందంతో చాలా సన్నగా మరియు డిఫరెంట్ డిజైన్ తో కనిపిస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :