ఐఫోన్ మాదిరిగా కనిపించే ఫోన్ ను లాంచ్ చేస్తున్న రియల్ మి.!
ఐఫోన్ మాదిరిగా కనిపించే ఫోన్ ను లాంచ్ చేస్తున్న రియల్ మి
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ లను వెల్లడించింది
ఈ ఫోన్ లో 12GB వరకూ భారీ డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉన్నట్లు చెబుతోంది
RealMe: ఐఫోన్ మాదిరిగా కనిపించే ఫోన్ ను లాంచ్ చేస్తున్న రియల్ మి. ఇటీవల ఐఫోన్ 14 మ్యాక్స్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపించే ఫీచర్ తో 10 వేల రూపాయల బడ్జెట్ లోనే C 55 స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చిన రియల్ మి, ఐఫోన్ 14 సిరీస్ హై ఎండ్ ఫోన్ లో కనిపించే మూడు కెమెరాల సెటప్ మాదిరిగా కనిపించే విధంగా ఉండే మరొక స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు లాంచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ ను మే 18 న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మి ప్రకటించింది. ఈ ఫోన్ గురించే మనం మాట్లాడుకుంటోంది.
Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ ను కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించి మరియు ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్స్ గా తీసుకువస్తునట్లు సూచిస్తోంది. ఈ పేజ్ నుండి ఈ అప్ కమింగ్ రియల్ మి స్మార్ట్ ఫోన్ గురించి కీలకమైన ఫీచర్ లను గురించి వెల్లడించింది. ఈ ఫోన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Realme Narzo N53: టీజింగ్ స్పెక్స్
Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ ను నెక్స్ట్-జెనరేషన్ డిజైన్ తీసుకొస్తున్నట్లు రియల్ మి చెబుతోంది. ఈ ఫోన్ 7.49mm మందంతో సన్నగా ఉంటుందని, కాలిఫోర్నియా సన్ షైన్ డిజైన్ తో ఈ ఫోన్ ఉన్నట్లు పేర్కొంది. ఇక ఈ ఫోన్ ఇమేజ్ ను పరిశీలిస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. కానీ, ఈ ఫోన్ లో మూడు కెమేరాలు ఉన్నట్లు కనిపిస్తుంది మరియు ఐఫోన్ 14 మ్యాక్స్ కెమేరా సెటప్ మాదిరిగా కనిపిస్తుంది.
ఈ ఫోన్ లో రైట్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు వాల్యూమ్ బటన్ కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 12GB వరకూ భారీ డైనమిక్ ర్యామ్ మరియు 2TB వరకూ ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ సపోర్ట్ ను కూడా అందుకోవచ్చని రియల్ మీ చెబుతోంది.
ప్రస్తుతానికి ఈ వివరాలను మాత్రమే టీజర్ ద్వారా కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబటికి, మరిన్ని ఫీచర్లను కూడా టీజర్ ద్వారా తెలియ చెయ్యవచ్చు.