గత కొన్ని రోజులుగా రియల్ మి తీసుజింగ్ చేస్తూన్న Realme narzo N53 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఐఫోన్ 14 మ్యాక్స్ ప్రో లో కనిపించే మాదిరిగా కెమేరా మరియు డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్లతో 10 ఉప బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈ నార్జో ఎన్53 ఫోన్ పైన బ్యాంక్ మరియు Jio బెనిఫిట్స్ ను కూడా జత చేసింది. ఈ లేటెస్ట్ రియల్ మి స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
రియల్ మి నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB+64GB) ను రూ. 8,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ధర రూ.10,999. ఈ రియల్ మి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పైన HDFC బ్యాంక్ యొక్క 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ ని యాడ్ చేసింది. HDFC బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొనే వారికి ఈ అఫర్ వర్తిస్తుంది.
రియల్ మి నార్జో ఎన్ 53 పైన రూ. 3,000 విలువ చేసే జియో బెనిఫిట్ ను కూడా కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ అఫర్ కేవలం రూ. 399 JioPlus Post paid ప్లాన్ పైన మాత్రమే వర్తిస్తుందని కూడా తెలిపింది. రియల్ మి నార్జో ఎన్ 53 యొక్క స్పెషల్ సేల్ మే 22వ తేది మధ్యాహ్నం 2 గంటలకు అమెజాన్ మరియు Realme.com నుండి మొదలువుతుంది.
రియల్ మి నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ లో 6.74 ఇంచ్ డిస్ప్లే 90Hz సపోర్ట్ తో కలిగి వుంది. ఇది 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా సన్నని మరియు లేటెస్ట్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో Mini Capsule ఫీచర్ ను కూడా అందించింది. నార్జో ఎన్ 53 Unisoc T612 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
నార్జో ఎన్ 53 స్మార్ట్ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ కెమేరాని మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ మరింత వేగంగా పని చేయడానికి వీలుగా ఇందులో 6GB వరకూ డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉందని రియల్ మి తెలిపింది.
రియల్ మి నార్జో ఎన్ 53 ఫోన్ ని బిగ్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో రియల్ మి అందించింది.