Realme Narzo 80x 5G ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!

Realme Narzo 80x 5G ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!
HIGHLIGHTS

Realme Narzo 80x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు రియల్ మీ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కూడా వెల్లడించింది

కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా వెల్లడించింది

Realme Narzo 80x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు రియల్ మీ అనౌన్స్ చేసింది. కేవలం ఈ ఫోన్ లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా వెల్లడించింది. గత నెలలో P3 సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన రియల్ మీ, ఇప్పుడు ఏప్రిల్ నెలలో నార్జో 80 సిరీస్ నుంచి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ సిరీస్ నుండి రెండు ఫోన్ లను లాంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది.

Realme Narzo 80x 5G : లాంచ్

రియల్ మీ నార్జో 80x 5G స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ ప్రైస్ హింట్ ను అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ గురించి అందించిన క్యాప్షన్ లో 13 వేల ఉప బడ్జెట్ లో స్టూడెంట్స్ కి బెస్ట్ గేమింగ్ ఫోన్ ఎంపిక అవుతుందని తెలిపింది. అంటే, ఈ ఫోన్ 13 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లాంచ్ అవుతుందని కంపెనీ హింట్ ఇచ్చింది.

Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

Realme Narzo 80x 5G : ఫీచర్స్

ఇదే టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కంప్లీట్ వివరాలు వెల్లడించింది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7.94mm మందం కలిగిన స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ టాప్ టైర్ వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో కూడా వస్తుందట. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో వస్తుంది మరియు జతగా మంచి ర్యామ్ మరియు పెద్ద ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది.

Realme Narzo 80x 5G

ఈ రియల్ మీ ఫోన్ వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఐ కంఫర్ట్ డిస్ప్లేతో వస్తుంది మరియు మంచి జనింగ్ సపోర్ట్ ఫ్రేమ్స్ అందిస్తుంది. అంతేకాదు, లాంగ్ టైమ్ గేమింగ్ కోసం అవసరమైన పెద్ద 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఈ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. అంతేకాదు, 200% సూపర్ వాల్యూమ్ మోడ్ కలిగిన హాయ్ Hi-Res Audio ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo