Realme Narzo 80x 5G: వాటర్ ప్రూఫ్ డిజైన్ మరియు 6000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. !

రియల్ మీ నార్జో 80 సిరీస్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ వెల్లడించింది
Realme Narzo 80x 5G ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్లు రియల్ మీ బయటపెట్టింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్లు ముందే తెలుసుకోండి
Realme Narzo 80x 5G: రియల్ మీ ఈ నెలలో లాంచ్ చేయబోతున్న రియల్ మీ నార్జో 80 సిరీస్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా వారం రోజులు ఉండగా ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్లు రియల్ మీ బయటపెట్టింది. వచ్చే వారాంతంలో రిలీజ్ కాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మరియు `ఫీచర్లు ముందే తెలుసుకోండి.
Realme Narzo 80x 5G : ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. ఈ సిరీస్ నుంచి రియల్ మీ నార్జో 80 ప్రో మరియు రియల్ మీ నార్జో 80x రెండు ఫోన్లను కూడా అదే రోజు విడుదల చేస్తుంది. ఈ ఫోన్ యొక్క టీజర్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు రియల్ మీ అందించింది.
ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 7.94mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన పవర్ ఫుల్ బ్యాటరీ తో 16 గంటలు ఇన్స్టాగ్రామ్ నడిపించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 5G చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను స్పీడ్ వేవ్ ప్యాట్రన్ డిజైన్ తో అందిస్తోంది.
ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ నార్జో 80x స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ మరియు IP 69 వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగి ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో Hi-Res Audio సపోర్ట్ కలిగిన స్పీకర్ సెటప్ ఉంటుంది మరియు ఇది 200% సూపర్ వాల్యూమ్ మోడ్ తో వస్తుంది.
Also Read: Flipkart సేల్ నుంచి 5 వేల బడ్జెట్ లో Aiwa Dolby సౌండ్ బార్ అందుకోండి.!
రియల్ మీ నార్జో 80x స్మార్ట్ ఫోన్ వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్ లను కూడా కలిగి ఉంటుంది.
Realme Narzo 80x 5G : ప్రైస్
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 13,000 లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది.