Realme Narzo 80 Pro 5G ఫోన్ ను సెగ్మెంట్ ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.!

Realme Narzo 80 Pro 5G లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది
ఈ ఫోన్ ను ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
Realme Narzo 80 Pro 5G స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ఈరోజు అనౌన్స్ చేసింది. గతవారమే రియల్ మీ P సీరీస్ నుంచి పి3 అల్ట్రా మరియు పి3 5జి స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసిన రియల్ మీ ఇప్పుడు మరొక కొత్త ఫోన్ లాంచ్ కూడా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి రియల్ మీ ఎలాంటి టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
Realme Narzo 80 Pro 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 80 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందని రియల్ మీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Realme Narzo 80 Pro 5G : ఫీచర్స్
రియల్ మీ నార్జో 80 ప్రో 4జి స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ ను రియల్ మీ వెల్లడించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే ప్రైస్ సెగ్మెంట్ లో ఈ చిప్ సెట్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందని కూడా రియల్ మీ గొప్పగా చెబుతోంది. ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ 7,80,000 పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా తెలిపింది.
అంటే, ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే ధర పరిధిలో పవర్ ఫుల్ చిప్ సెట్ కలిగి మంచి పెర్ఫార్మెన్స్ అందించే ఫోన్ గా ఈ అప్ కమింగ్ ఫోన్ ఉంటుందని రియల్ మీ హింట్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు ఎంత ఎక్కువ AnTuTu స్కోర్ ఉంటే అంత మంచి పెర్ఫార్మెన్స్ అందుతుందని కూడా టీజర్ పేజి ద్వారా రియల్ మీ తెలిపింది.
Also Read: భారీగా తగ్గిన iQOO 12 5G స్మార్ట్ ఫోన్ ధర.. కొత్త ప్రైస్ ఎంతంటే.!
ఇఈ ఫోన్ కోసం అమెజాన్ అందించిన టీజర్ పేజీలో అందించిన ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు అధిక రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుందని కూడా అర్ధం అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఫ్రేమ్ రేట్ గురించి కూడా కంపెనీ టీజింగ్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు అందించలేదు. అయితే, త్వరలోనే ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన వివరాలు కూడా అందించే అవకాశం ఉండవచ్చు.