Realme కొత్త ఫోన్ ను చవక ధరలో 45W ఫాస్ట్ ఛార్జర్ తో కొత్త లాంఛ్ చేస్తోంది.!
Realme Narzo 70x 5G లాంఛ్ డేట్ అనౌన్స్ చేసింది
Narzo 70 సిరీస్ నుండి కొత్త ఫోన్ విడుదల చెయ్యడానికి Realme సిద్దమయ్యింది
ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్ మి, తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme Narzo 70x 5G లాంఛ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే రియల్ P1 Series నుండి రెండు కొత్త ఫోన్ లను విడుదల చేసిన రియల్ మి, ఇప్పుడు Narzo 70 సిరీస్ నుండి మరొక కొత్త ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్దమయ్యింది. రియల్ మి తీసుకు రాబోతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఫీచర్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
Realme Narzo 70x 5G: Launch
రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 70x 5జి ను ఏప్రిల్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేస్తున్నట్లు రియల్ మి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం Amazon ఇప్పటికే మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తున్నట్లు కూడా అమెజాన్ తెలిపింది.
రియల్ మి నార్జో 70x 5జి: టీజ్డ్ ప్రైస్
రియల్ మి నార్జో 70x 5జి స్మార్ట్ ఫోన్ ను 12 వేల ఉప బడ్జెట్ లో లాంఛ్ చేయబొతునట్లు టీజింగ్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ అంచనా ప్రైస్ తో ఈ ఫోన్ పైన అంచనాలను పెంచుతోంది.
Also Read: ధమాకా ఆఫర్: 25 వేలకే 50 ఇంచ్ Smart Tv అందుకోండి.!
Realme Narzo 70x 5G: టీజ్డ్ స్పెక్స్
ఇక ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రియల్ మీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా కనిపిస్తోంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా సన్నగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఫోన్లో వెనుక పెద్ద గుండ్రని బంప్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ ఉన్నట్లు మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా ఉన్నట్లు కనిపిస్తోంది.
రియల్ మి నార్జో 70x 5జి ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని కూడా రియల్ మి తెలిపింది. ముఖ్యంగా, ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు కంపెనీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.
ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క టీజర్ పేజ్ నుండి 12 వేల ఉప బడ్జెట్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ కలిగి వుండనున్న బెస్ట్ ఫోన్ గా కంపెనీ చెబుతోంది.