Realme Narzo 70 Turbo: చాలా చవక ధరలో గొప్ప ఫీచర్స్ తో వచ్చింది.!

Updated on 09-Sep-2024
HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు చాలా చవక ధరలో గేమింగ్ చిప్ సెట్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసింది

యల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ ను విలక్షణమైన కొత్త కలర్ డిజైన్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది

Realme Narzo 70 Turbo: రియల్ మీ ఈరోజు చాలా చవక ధరలో గేమింగ్ చిప్ సెట్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే, రియల్ మీ నార్జో 70 టర్బో మరియు ఈ ఫోన్ ను విలక్షణమైన కొత్త కలర్ డిజైన్ తో లాంచ్ చేసింది. రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme Narzo 70 Turbo: ప్రైస్

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో బేసిక్ (6GB + 256GB) వేరియంట్ ను రూ. 16,999 ధరతో లాంచ్ చేసింది. రెండవ 8GB + 128GB వేరియంట్ ను రూ. 17,999 ధరతో మరియు హై ఎండ్ 12GB + 256GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.

ఆఫర్స్

రియల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ పై మంచి దివాళీ కూపన్ ఆఫర్ కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పైన యూజర్లకు రూ. 2,000 అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది. అంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఆఫర్ దీపావళీ 2024 పండుగ లోపు కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Realme Narzo 70 Turbo: ఫీచర్స్

రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ OLED Esports స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ యొక్క వేగవంతమైన ప్రోసెసర్ Dimensity 7300 Energy తో లాంచ్ అయ్యింది. దీనికి జతగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 14GB డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

ఈ రియల్ మీ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP AI ప్రధాన సెన్సార్ + + 2MP పోర్ట్రైట్ సెన్సార్ లు వున్నాయి. నార్జో 70 టర్బో ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 30 fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు మరియు గొప్ప ఫోటోలు పొందవచ్చని రియల్ మీ తెలిపింది.

Also Read: Apple Event 2024: ఈరోజు iPhone 16 Series తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్న యాపిల్.!

ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి వీలుగా పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టం ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ GT మోడ్ తో వస్తుంది మరియు 90fps వద్ద గేమింగ్ ను ఎంజాయ్ చేయొచ్చు అని రియల్ మీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :