Realme Narzo 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. స్టన్నింగ్ డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చిన ఈ ఫోన్ పై కంపెనీ ఈరోజు భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు ఈరోజు అమెజాన్ మరియు realme.com నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు 15 వేల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు.
రియల్ మీ నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 16,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై అమెజాన్ మరియు రియల్ మీ వెబ్సైట్ ద్వారా ఈరోజు రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ రేటుకు 6GB + 128GB వేరియంట్ లభిస్తుంది.
ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ రూ. 17,999 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై కూడా రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ వేరియంట్ ను రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL: రూ. 800 కంటే తక్కువ ఖర్చుతోనే 300 రోజులు వ్యాలిడిటీ అందుకోండి.!
రియల్ మీ నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Energy చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB/6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI BOOST 2.0 మరియు పెద్ద స్టీల్ కూలింగ్ ఛాంబర్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6. 67 ఇంచ్ OLED Esports స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు రైన్ వాటర్ స్మార్ట్ టచ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ (30fps) సపోర్ట్ తో వస్తుంది. రియల్ మీ నార్జో 70 టర్బో 5జి స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.