Realme Narzo 70 Turbo 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా రియల్ మీ వెల్లడించింది
ఈ ఫోన్ కేవలం 7.6mm మందం మాత్రమే ఉంటుంది
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న రియల్ మీ, ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. రియల్ మీ నార్జో 70 టర్బో ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా రియల్ మీ వెల్లడించింది.
Realme Narzo 70 Turbo 5G : లాంచ్
రియల్ మీ నార్జో 70 టర్బో స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా బయటపెట్టింది.
Realme Narzo 70 Turbo 5G : ఫీచర్స్
రియల్ మీ నార్జో 70 టర్బో ను మీడియాటెక్ లేటెస్ట్ మిడ్ రేంజ్ ప్రోసెసర్ తో తీసుకొస్తున్నట్లు రియల్ మీ వెల్లడించింది. అదేమిటంటే, ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ చిప్ సెట్ పెర్ఫార్మెన్స్ వివరాలు తెలియ చేసే స్కోర్ వివరాలు కూడా వెల్లడించింది.
ఈ ఫోన్ లో అందించే డైమెన్సిటీ చిప్ సెట్ 750K AnTuTu స్కోర్ ను కలిగి ఉంటుంది మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ 4nm ఫ్యాబ్రికేషన్ పై నడుస్తుంది మరియు ఎఫిషియంట్ గా ఉంటుంది. ఈ ప్రోసెసర్ తో ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: విశాఖపట్నంలో BSNL 4G సర్వీస్ లు మొదలు పెట్టిన ప్రభుత్వ టెలికాం.!
ఈ ఫోన్ యొక్క ఇతర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ కేవలం 7.6mm మందం మాత్రమే ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 185 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందిట.
ఈ ఫోన్ ఎల్లో మరియు బ్లాక్ డ్యూయల్ కలర్ తో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ ఉంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ కోసం డేట్ ప్రకటించింది కాబట్టి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేసే అవకాశం ఉంటుంది.