Realme Narzo 70 Pro 5G స్మార్ట్ ఫోన్ విడుదల గురించి కంపెనీ డేట్ ఫిక్స్ చేసింది. రియల్ మి యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కొత్త ఎయిర్ జెశ్చర్ మరియు Sony కెమేరా వంటి మరిన్ని ఫీచర్లతో వస్తోంది. ఈ స్మార్ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్స్ ద్వారా ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటుగా రియల్ మి బడ్స్ టి300 బడ్స్ యొక్క కొత్త కలర్ వేరియంట్ ను కూడా తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
రియల్ మి నార్జో 70 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను 19 March 2024 తేది మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, అదే రోజు సాయంత్రం 6 గంటలకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క Early Bird Sale ను కూడా నిర్వహిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటుగా రియల్ మి బడ్స్ టి300 బడ్స్ ను కూడా అదే ఈరోజు లాంఛ్ చేస్తోంది.
రియల్ మి నార్జో 70 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ సన్నని స్లీక్ డిజైన్ తో వస్తోంది.ఈ ఫోన్లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది మరియు ముందు సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో డిస్ప్లే వుంది. ఈ ఫోన్ లో అందించిన మెయిన్ సెన్సార్ గురించి కంపెనీ వివరాలను బయట పెట్టింది. ఈ ఫోన్ ను SonyIMX890 మెయిన్ కెమేరాతో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో అందించైనా మరొ రెండు ఫీచర్స్ గురించి కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది. ఇందులో ఒకటి ఎయిర్ జెశ్చర్ మరియు రెండవది రైన్ వాటర్ స్మార్ట్ టచ్. ఈ రెండు ఫీచర్స్ ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రత్యేకమైన ఫోనుగా నిలబెడతాయని కంపెనీ యోచిస్తోంది.
Also Read: సాధారణ వాచ్ రేటుకే బ్రాండెడ్ Smart Watch అందుకోండి.!
వాస్తవానికి, తర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎయిర్ జెశ్చర్ ఫీచర్స్ ను ఎనేబుల్ చేసే అవకాశం ఆండ్రాయిడ్ ఫోన్ లలో ముందు నుండే అందుబాటులో వుంది. అయితే, ఈ ఎటువంటి తర్డ్ పార్టీ అవసరం లేకుండా ఈ ఫోన్ లో ఈ ఫీచర్ ను నేరుగా అందించింది. ఇక రెండవస్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, వర్షంలో కూడా ఈ ఫోన్ స్క్రీన్ ఎటువంటి ఆకటంకం లేకుండా సాఫీగా పని చేసేలా రైన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ పని చేస్తుంది.
అంతేకాదు, రియల్ మి నార్జో 70 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం ఇప్పటి వరకూ ఈ ఫోన్ గురించి కంపెనీ అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ కెమేరా మరియు డిస్ప్లే మరియు డిజైన్ తో ఆకట్టుకుంటోంది.