Tech News: ప్రముఖ మొబైల్ బ్రాండ్ Realme ఈరోజు భారత్ లో New Look తో కొత్త బడ్జెట్ 5G ఫోన్ లాంచ్ చేసింది. అదే, Realme Narzo 60x 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కేవలం 13 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో రియల్ మి ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయినా కూడా ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న చాలా ఫీచర్లను కలిగి వుంది. మరి Realme Narzo 60x 5G కలిగి వున్న ఆ స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.
Realme ఈ Narzo 60x 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 4GBRAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర మరియు 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం మీరు రూ. 14,499 చెల్లించ వలసి ఉంటుంది. ఈ ఫోన్ పైన లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా Realme అనౌన్స్ చేసింది. Narzo 60x 5G ఫోన్ ను ICICI కార్డ్ తో కొనేవారికి రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Realme Narzo 60x 5G First Sale సెప్టెంబర్ 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart మరియు Realme అధికారిక వెబ్సైట్ నుండి మొదలవుతుంది.
రియల్ మి నార్జో 60X 5జి స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను విలక్షణమైన ఇంటర్స్టెల్లార్ X డిజైన్ తో రియల్ మి లాంచ్ చేసింది. ఈ ఫోన్ MediaTek Dimensity 600+ ఆక్టా కోర్ 5G Processor తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 7.89 mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ స్టెల్లార్ గ్రీన్ మరియు నెబ్యూలా పర్పల్ రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
Realme Narzo 60x 5G స్మార్ట్ ఫోన్ లో 50MP AI కెమేరాని 5P లెన్స్ మరియు f/1.8 అపర్చర్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6GB వరకూ డైనమిక్ ర్యామ్, 128GB వరకూ హెవీ స్టోరేజ్ మరియు Realme లేటెస్ట్ UI 4.0 (Android 13 OS) ఉన్నాయి. ఈ Narzo 60x 5G ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.