digit zero1 awards

భారీ ఆఫర్లతో Realme Narzo 60x 5G బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

భారీ ఆఫర్లతో Realme Narzo 60x 5G బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.!
HIGHLIGHTS

Realme Narzo 60x 5G ఈరోజు మొదటిసారిగా సేల్ కి వస్తోంది

13 వేల ఉప బడ్జెట్ కేటగిరిలో కొత్త మరియు స్టైలిష్ 5G స్మార్ట్ ఫోన్

Realme narzo 60x 5g పైన రూ. 1,000 తగ్గింపు కూపన్ అఫర్ ను అందించింది రియల్ మి

రియల్ మి ఇండియాలో సరికొత్తగా లాంచ్ చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Realme Narzo 60x 5G ఈరోజు మొదటిసారిగా సేల్ కి వస్తోంది. Realme యొక్క Narzo 60x 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ పైన భారీ ఆఫర్లను కూడా Realme ప్రకటించింది. 13 వేల ఉప బడ్జెట్ కేటగిరిలో కొత్త మరియు స్టైలిష్ 5G స్మార్ట్ ఫోన్ ను కొనాలని చూస్తున్న వారికీ ఈ ఫోన్ ఒక అప్షన్ అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన డీల్స్ మరియు ఫోన్ వివరాలు తెలుసుకోండి. 

Realme narzo 60x 5g offers

Realme narzo 60x 5g పైన కంపెనీ అందించిన offers విషయానికి వస్తే, ఈ ఫోన్ పైన రూ. 1,000 తగ్గింపు కూపన్ అఫర్ ను అందించింది రియల్ మి. ఈ అఫర్ తో ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ ను రూ. 11,999 రూపాయల ధరకే పొందవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన భారీ ఎక్స్ చేంజ్ అఫర్ ను కూడా అఫర్ చేస్తోంది. Buy From Here

Big Deal: సగం ధరకే లభిస్తున్న Nokia 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ.! 

Realme narzo 60x 5g specifications

రియల్ మి నార్జో 60x 5g స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 6100+ ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ కి జతగా 12GB RAM (6GB ర్యామ్ + 6GB డైనమిక్ ర్యామ్) ఫీచర్ మరియు 128 GB స్టోరేజ్ తో వస్తుంది. 60x 5G  ఫోన్ 6.72 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz నుండి 45Hz రిఫ్రెష్ రేట్ వరకూ గల 6 లెవల్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 

ఈ నార్జో 60x 5G ఫోన్ 33 W పవర్ ఫుల్ SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో  50MP AI డ్యూయల్ కెమేరా మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ రియల్ మి లేటెస్ట్ ఫోన్ ‎Android 13.0 OS పైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది మరియు ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo