Realme కొత్త ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది..దీని ప్రత్యేకతలు ఏమిటంటే.!
Realme కొత్త ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది
ఈ ఫోన్ ఐఫోన్ 13 లో కనిపించే బిగ్ ట్రిపుల్ కెమేరా డిజైన్ తో కనిపిస్తోంది
కంపెనీ ఇప్పటికే కొన్ని కీలకమైన ఫీచర్లను టీజర్ ద్వారా తెలియ చేసింది
Realme కొత్త ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతోంది. అదే Realme Narzo N53 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఐఫోన్ 13 లో కనిపించే బిగ్ ట్రిపుల్ కెమేరా డిజైన్ తో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లుక్స్ పరంగా అక్కటుకుంటోంది మరియు ఈ ఫోన్ లో ఫీచర్ల పరంగా ఎలా ఉంటుందో ఫోన్ లాంచ్ తరువాత చూడాలి. అయితే, కంపెనీ ఇప్పటికే కొన్ని కీలకమైన ఫీచర్లను టీజర్ ద్వారా తెలియ చేసింది. రేపు ఇండియాలో విడుదల కాబోతున్న ఈ రియల్ మి స్మార్ట్ ఫోన్ యొక్క సంగతులు ఏమిటో చూసేద్దాం పదండి.
Realme Narzo N53
రియల్ మి నార్జో ఎన్53 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా రియల్ మి తీసుకువస్తునట్లు సూచించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ ను అందించింది మరియు స్పెక్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను రియల్ మి Gold ఫిల్మెంట్ కోటింగ్ మరియు కాలిఫోర్నియా సన్ షైన్ డిజైన్ తో తీసుకు వస్తున్నట్లు టీజింగ్ నుండి తెలిపింది.
ఈ ఫోన్ యొక్క ఛార్జింగ్ సిస్టమ్ మరియు బ్యాటరీ వివరాలను కూడా పంచుకుంది రియల్ మి. Narzo N53 ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఓవర్ టెంపరేచర్ ప్రొటక్షన్ కలిగిన 5000mAh బ్యాటరీతో అందిస్తున్నట్లు టీజింగ్ ద్వారా చెబుతోంది.
ఈ ఫోన్ లో ఉన్న మరొక ఫీచర్ గురించి కూడా టీజర్ నుండి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో డైనమిక్ RAM ఫీచర్ తో 12GB వరకూ ర్యామ్ ను అందుకోవచ్చని హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ 2TB ఎక్స్ టర్నల్ స్టోరేజ్ కి సపోర్ట్ కూడా సపోర్ట్ ను కలిగి వుంది.
ఇది బడ్జెట్ సిరీస్ నుండి వస్తున్న ఫోన్ కాబట్టి ధర కూడా బడ్జెట్ యూజర్లను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ మే 18, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది.