ఇప్పటివరకూ నాలుగు ఫోన్లను విడుదల చేసిన రియల్మీ, ఇప్పుడు త్వరలో తీసుకురానున్న ఒక స్మార్ట్ ఫోన్ను, ఒక 48MP కెమెరాతో తేనున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 2019 మొదట త్రైమాసికంలో రియల్ 3 స్మార్ట్ ఫోన్ను, ప్రకటించనున్నట్లు ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. ఈ రాబోయే హ్యాండ్ సెట్ Realme 2 కంటే విభిన్నంగా చేయనున్నట్లు, రియల్మి ఇండియా యొక్క ఇండియా సీఈఓ అయిన, మాధవ్ శేత్, తెలిపారు.
అయితే, ఈ డివైజ్ వివరాలు లేదా దాని ధరల గురించి మాత్రం సమాచారం లేదు. ఈ కంపెనీ 48MP సెన్సారుతో ఒక హ్యాండ్ సెట్ చేసే పనిలో ఉన్నట్లు పేర్కొంది, అయితే ఈ కెమెరా సెటప్పును Realme 3 లేదా కొన్ని ఇతర ఫోన్లలో అమలు చేస్తుందనే విషయం మాత్రం ఇంకా తెలియదు. ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ లేదా "పంచ్-హోల్ " స్క్రీన్లతో ఒక ఫోన్ను రిలీజ్ చేయడం రియల్మీకి, ఎలాంటి ప్రయోజనం లేదని ఎగ్జిక్యూటివ్ పేర్కొంది.
ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎంట్రీ-స్థాయి రియల్మీ A1 స్మార్ట్ ఫోన్ను రియల్మీ ప్రకటించనున్నట్లు కూడా ఊహిస్తున్నారు. ఈ ఫోన్ రూ. 6000 ధరలో, ఒక మీడియా టెక్ హీలియో P60 లేదా స్నాప్డ్రాగన్ 600 సీరీస్ చిప్సెట్ తో అమలు చేయనుంది. ఇది వెనుకభాగంలో ఒక డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంటుందని మరియు ముందు AI- ఆధారిత సెల్ఫీ కెమేరాతో ఉంటుందని ఊహించారు. సాఫ్ట్వేర్ పరంగా, ఈ హ్యాండ్సెట్ Android 8.1 Oreo- ఆధారిత ColorOS 5.2 తో అమలవుతుంది.