మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 నుండి రియల్ మి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్ తో Realme GT 3 స్మార్ట్ ఫోన్ ను ఆవిస్కరించింది. రియల్ మి GT 3 స్మార్ట్ ఫోన్ ను 9 నిముషాల్లోనే బ్యాటరీ ఫుల్ చేసే 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ ఫోన్ తెచ్చినట్లు రియల్ మి తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఛార్జింగ్ టెక్ పరంగా మాత్రమే కాదు మరిన్ని ఇతర వినూత్నమైన ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చుద్దామా.
రియల్ మి GT3 స్మార్ట్ ఫోన్ ను రియల్ మి 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ తో అందించింది. ఈ ఫోన్ లో అందించిన 4,600 mAh బ్యాటరీనిఇందులో అందించిన 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 9 నిముషాల 30 సెకండ్స్ లోనే పూర్తి బ్యాటరీని నింపగలదని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఇంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్ ఈ ఫోన్ అందించినా ఛార్జింగ్ అడాప్టర్ ను మాత్రం రియల్ మి యొక్క 150W అడాప్టర్ కంటే చిన్నగానే అందించడం విశేషంగా చెప్పవచ్చు.
అయితే, రియల్ మి ఈ ఫోన్ యొక్క సేఫ్టీ విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతోంది. వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్, ఫైర్ ప్రూఫ్ డిజైన్, 13 టెంపరేచర్ డిజైన్ మరియు 60 లేయర్స్ ప్రొటక్షన్ వంటి అన్ని సేఫ్టీ మెజర్స్ తో ఈ ఫోన్ వస్తుంది.
ఇక ఈ లేటెస్ట్ ఫోన్ లోని మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ చిప్ సెట్ 4nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది. ఈ ప్రోసెసర్ పనితనం మరియు ఎనర్జీ సేవింగ్ గురించి యూజర్ల నుండి మంచి రివ్యూ లను అందుకుంది.
ఒక స్పెషల్ ఫీచర్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అదేమిటంటే, పల్స్ ఇంటర్ ఫేజ్ గా పిలవబడుతున్న యూనిక్ డిజైన్ గురించి మనం చెప్పవచ్చు. ఎందుకంటే, ఛార్జింగ్ స్టేటస్, కాల్ మరియు నోటిఫికేషన్ ఇండికేషన్ ల కోసం రకరకాలైన లైట్ ఎఫెక్ట్ లను చూపిస్తుంది. ఇందులో, మీరు 25 వరకూ కలర్ అప్షన్స్, 2 రకాల రిథమ్స్ మరియు 5 రకాల లైటింగ్ స్పీడ్ మోడ్ లు ఉన్నాయి. కాబట్టి, మీకు నచ్చిన లేదా తగిన విధంగా మీరు ఈ ఎఫెక్ట్'లను సెట్ చేసుకునే వీలుంది.