Realme GT7 Pro లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన GT సీరీస్ నుంచి రాబోతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి కంపెనీ టీజింగ్ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, క్వాల్కమ్ యొక్క సరికొత్త చిప్ సెట్ Snapdragon 8 Elite తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలు కూడా ఈ టీజర్ ద్వారా అందించింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ (ఒకప్పుడు ట్విట్టర్) నుంచి ఈ ఫోన్ టీజింగ్ వివరాలు షేర్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం, రియల్ మీ GT7 ప్రో స్మార్ట్ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను నవంబర్ నెలలో లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది.
ఈ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుందని కంపెనీ టీజింగ్ చెబుతోంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకొస్తోంది. అంటే, ఈ ఫోన్ కు అఫీషియల్ సేల్ పార్టనర్ గా అమెజాన్ కొనసాగుతుంది.
ఈ ఫోన్ ఫీచర్స్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ చిప్ సెట్ గురించి మాత్రం క్వాల్కమ్ పూర్తి వివరాలు బయట పెట్టింది. 8 Elite చిప్ సెట్ కస్టమ్ Qualcomm Oryon CPU కలిగిన మొదటి చిప్ సెట్ అవుతుంది. ఈ చిప్ సెట్ పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త చిప్ సెట్ 3nm ప్రాసెస్ నోడ్ ఫై వర్క్ చేస్తుంది. ఇది 4.32 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించే చిప్ సెట్ మరియు X80 మోడెమ్ తో అద్భుతమైన 5G స్పీడ్ ను అందిస్తుందని కూడా క్వాల్కమ్ తెలిపింది.
Also Read: Samsung Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ దివాళీ సేల్ భారీ ఆఫర్లు.!
మరి ముఖ్యంగా ఈ చిప్ సెట్ ఫోటోలు మరియు వీడియోల కోసం మరింత ప్రత్యేకంగా ఉంటుందని క్వాల్కమ్ తెలిపింది. ఈ చిప్ సెట్ AI పెట్ సూట్, హెక్సా గాన్ డైరెక్ట్ లింక్ మరియు వీడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి మరిన్ని AI ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ చిప్ సెట్ ఫీచర్స్ ద్వారా రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ ను అంచనా వేస్తున్నారు. వవ చిప్ సెట్ లెక్క ప్రకారం పవర్ ఫుల్ స్క్రీన్, కెమెరా మరియు ర్యామ్ సపోర్ట్ లతో రియల్ మీ GT7 Pro ను లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.