Realme GT7 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కెమెరా ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ఇండియా యొక్క మొదటి అండర్ వాటర్ కెమెరా మోడ్ ఫోన్ గా తీసుకువస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ మరియు మరిన్ని ఫీచర్స్ ను కూడా ఈరోజు వెల్లడించింది.
రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్ ను ఈరోజు రియల్ మీ వెల్లడించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉందని ముందుగా ప్రకటించిన రియల్ మీ ఈరోజు ఇందులో ఉన్న సెన్సార్ లను బటయ పెట్టింది. రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మూడు Sony ప్రీమియం సెన్సార్ లతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ లో Sony IMX355, Sony IMX882 (3x) పెరిస్కోప్ మరియు Sony IMX906 ప్రధాన సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ అద్భుతమైన క్లారిటీతో ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఇది మాత్రమే కాదు, నీటిలో కూడా ఫోటోలు లేదా వీడియోలు షూట్ చేసేలా అండర్ వాటర్ మోడ్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్ మీ పేర్కొంది.
కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ ఇండియా యొక్క మొదటి అండర్ వాటర్ కెమెరా మోడ్ ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ జూమ్ ను శామ్సంగ్ యొక్క ప్రీమియం కెమెరా స్మార్ట్ ఫోన్ S24 అల్ట్రా తో పోల్చి చూపించే ప్రయత్నం
చేసింది.
Also Read: Oppo Find X8 Series గ్లోబల్ లాంచ్ ఇండియా నుంచి ప్రకటించిన ఒప్పో.!
రియల్ మీ ఈ ఫోన్ ను నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ 3nm ఫ్యాబ్రికేషన్ తో ఉంటుంది మరియు ఇది 30M+ AnTuTu స్కోర్ ను అందిస్తుంది. రియల్ మీ GT 7 ప్రో ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.
ఈ ఫోన్ అప్ మరిన్ని ఫీచర్స్ మరియు అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.