రియల్ మీ GT సిరీస్ నుండి ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ ప్రస్తావన తీసుకొచ్చింది రియల్ మీ. ఈ నెలలో రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ ను భారత మొబైల్ మార్కెట్ లో విడుదల చేసింది రియల్ మీ. ఈ ఫోన్ లాంచ్ తరువాత అప్ కమింగ్ ఫోన్ Realme GT6 లాంచ్ ను కూడా అనౌన్స్ చేసింది. రియల్ మీ అధికారిక X అకౌంట్ ను ఇది ఈ ఫోన్ లాంచ్ ను గురించి వెల్లడించింది.
రియల్ మీ ఫౌండర్ మరియు CEO అయిన స్కై లీ ఈ ఫోన్ ప్రమోషనల్ వీడియో లో ఈ ఫోన్ ను జూన్ 20న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫోన్ లాంచ్ ను మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ను తెలిపేలా టీజర్ ను కూడా కంపెనీ అందించింది. కంపెనీ అందించి టీజర్ ద్వారా ఈ ఫోన్ ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ తో వచ్చే అవకాశం వుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజర్ ద్వారా లో రియల్ జిటి సిరీస్ నుండి వచ్చిన అన్ని ఫోన్ల ప్రత్యేకతలు మరియు లాంచ్ డేట్ లను మరోసారి గుర్తు చేసింది. GT సిరీస్ నుండి తీసుకు వచ్చిన ఫోన్లు కలిగిన ప్రత్యేకత గురించి మరి ముఖ్యంగా చూపించింది. ఈ సిరీస్ నుండి వచ్చిన మొదటి ఫోన్ రియల్ మీ జిటి, సెగ్మెంట్ ఫస్ట్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ ఫోన్ గా నిలిచింది.
ఇలా రియల్ మీ జిటి సిరీస్ నుండి వచ్చిన అన్ని ఫోన్ల ప్రత్యేకతలు ఈ టీజర్ వీడియోలో వివరించింది. అంటే, రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ జిటి6 ఫోన్ కూడా ఇదే దారిలో గొప్ప ఫీచర్స్ తో రాబోతున్నట్లు కంపెనీ చెప్పకనే చెబుతోంది. ఇప్పటి వరకూ జిటి సేర్సి నుండి వచ్చిన అన్ని ఫోన్లు కూడా భారీ ఫీచర్స్ తో వచ్చిన ఫ్లాగ్ షిప్ ఫోన్లుగా నిలిచాయి.
Also Read: OnePlus 12 కొత్త వేరియంట్ ను జూన్ 6న విడుదల చేస్తోంది..!
రియల్ మీ జిటి6 గురించి కంపెనీ కమపేని కేవలం ఒక్క విషయాన్ని మాత్రామే తెలిపింది. అదేమిటంటే, ఈ ఫోన్ రియల్ మీ నుండి వస్తున్న మొదటి AI ఫ్లాగ్ షిప్ ఫోన్ అని తెలిపింది. అంటే, ఈ ఫోన్ పూర్తి AI పవర్ తో అందిస్తున్నట్లు అర్ధం అవుతోంది. మరి చూడాలి రియల్ మీ ఈ ఫోన్ ను ఎటువంటి ఫీచర్స్ మరియు ప్రత్యేకతలతో తీసుకు వస్తుందో అని.