Realme GT6: ఫ్లాగ్ షిప్ Sony కెమెరా మరియు 6000 నిట్స్ బ్రైట్నెస్ డిస్ప్లేతో వస్తుంది.!

Updated on 13-Jun-2024
HIGHLIGHTS

Realme GT6 ఫోన్ కొత్త వివరాలు అందించింది

రియల్ మీ GT6 ఫోన్ ను 50MP Sony LYT-808 కెమెరాతో తీసుకు వస్తున్నట్లు తెలిపింది

ఈ సెన్సార్ OIS మరియు AI సపోర్ట్ తో ఉంటుందని తెలిపింది

Realme GT6: రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ కెమెరా మరియు డిస్ప్లే వివరాలు ఈ రోజు విడుదల చేసింది. రియల్ అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్ కొత్త వివరాలు అందించింది. ముందుగా ఈ ఫోన్ డిజైన్ మరియు ప్రోసెసర్ వివరాలు అందించిన రియల్ మీ, ఈరోజు కెమెరా మరియు డిస్ప్లే వివరాలు అందించింది. ఈ ఫోన్ యొక్క టీజర్ వీడియోల ద్వారా ఈ ఫోన్ చాలా శక్తివంతమైన వివరాలతో తీసుకు వస్తునట్టు చెబుతోంది.

Realme GT6 కొత్త ఫీచర్లు ఏమిటి?

రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ ను 50MP Sony LYT-808 కెమెరాతో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ సెన్సార్ OIS మరియు AI సపోర్ట్ తో ఉంటుందని తెలిపింది. అలాగే, దీనికి జతగా 2X టెలిఫోటో లెన్స్ మరియు మరొక సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో సూపర్ నైట్ స్కేప్ మోడ్, 2X పోర్ట్రైట్ మోడ్ మరియు హైపర్ టోన్ ఇమేజ్ ఇంజిన్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ లో Next AI సహాయం కూడా వుంది మరియు ఇది కెమెరాతో అనుసంధానం అవుతుంది. అలాగే, AI నైట్ విజన్ మోడ్ మరియు AI స్మార్ట్ రిమూవల్ వంటి మరిన్ని ఫీచర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.

Realme GT6 Camera

ఈ ఫోన్ డిస్ప్లే వివరాలను కూడా కంపెనీ ఈరోజు వెల్లడించింది. ఈ ఫోన్ లో Pro XDR డిస్ప్లే అందించినట్లు తెలిపింది. ఇది ఈ సిరీస్ నుంచి ముందుగా వచ్చిన రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ మాదిరిగా 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుందని చెబుతోంది.

Also Read: Flipkart Mega June Bonanza Sale నుండి క్యూలెడ్ టీవీల పై ధమాకా ఆఫర్స్ అందుకోండి.!

ఇక ఈ ఫోన్ ఇతర కీలకమైన ఫీచర్ ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 ప్రోసెసర్ మరియు LPDDR5X ర్యామ్ మరియు UFS 4.0 ఫాస్ట్ మెమెరీతో తీసుకొస్తున్నట్లు ముందే తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో కూలింగ్ కోసం పెద్ద VC ఛాంబర్ ఉన్న విషయం కూడా తెలిపింది. ఈ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను 120W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్న విషయాన్ని కూడా టీజర్ ద్వారా బయట పెట్టింది.

ఈ ఫోన్ జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ లాంచ్ కి ఇంకా సమయం వుంది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్ లను కూడా కంపెనీ ముందే వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :