Realme GT6: పవర్ ఫుల్ AI ఫీచర్స్ మరియు 50MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

Updated on 05-Jun-2024
HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్

రియల్ మీ ఇప్పుడు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లతో టీజింగ్ స్పీడ్ ను మరింత పెంచేసింది

రియల్ మీ జిటి6 స్మార్ట్ ఫోన్ జూన్ 20 వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది

Realme GT6: రియల్ మీ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లతో టీజింగ్ స్పీడ్ ను మరింత పెంచేసింది. రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ డిజైన్ తో పాటు ఈ ఫోన్ లో ఉన్న కెమెరా సెటప్ మరియు AI ఫీచర్స్ ను వివరిస్తూ కొత్త టీజర్ పోస్ట్ లను రియల్ మీ అధికారిక X నుండి రిలీజ్ చేసింది.

Realme GT6 Launch

రియల్ మీ జిటి6 స్మార్ట్ ఫోన్ జూన్ 20 వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను కొత్త నానో మిర్రర్ డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ చూడటానికి చాలా మెరుస్తూ షైనిగా కనిపిస్తోంది. ఈ ఫోన్ ను ఉత్సాహకరమైన 4 పాయింట్స్ అప్గ్రేడ్ తో అందిస్తున్నట్లు కంపెనీ టీజర్ లో తెలిపింది. ఇందులో, గ్లాస్ డిజైన్, పెర్ఫార్మన్స్, కెమెరా మరియు AI ఫీచర్ లు ఉన్నట్లు తెలిపింది.

Realme GT6 Features

ఈ ఫోన్ డిజైన్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాము. ఇక ఈ ఫోన్ కెమెరా సెటప్ ను చూస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా వుంది. ఈ కెమెరాతో అద్భుతమైన ఫోటోల కోసం AI Night Vision Mode వంటి AI ఫీచర్లు ఉన్నట్లు రియల్ మీ టీజర్ ద్వారా వెల్లడించింది.

Also Read: Vivo X Fold 3 Pro: రేపు లాంచ్ అవుతున్న వివో ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకోండి.!

ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్ అద్భుతాన్ని వివరించేలా కొత్త వీడియో టీజర్ ను అందించింది. ఇందులో నీటిలో తిరుగుతున్న జెల్లీ ఫిష్ వీడియో వుంది. ఇందులో 15 Pro Max ఫోన్ తో తీసినట్లు చెబుతున్న వీడియో మరియు రియల్ మీ జిటి6 కెమెరాతో తీసిన వీడియోల మధ్య వ్యత్యాసాలను చూపిస్తోంది. ఇందులో రియల్ మీ జిటి6 ఫోన్ తో తీసిన వీడియో గొప్ప రంగులు మరియు వివరాలను అందిస్తోంది.

అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాలో AI స్మార్ట్ లూప్ మరియు AI స్మార్ట్ రిమూవల్ ఫీచర్స్ కూడా ఉన్నట్లు తెలిపింది. జూన్ 11న ఈ ఫోన్ యొక్క మరికొన్ని కీలకమైన ఫీచర్స్ ను వెల్లడించబోతున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ వివరాలను వెల్లడిస్తుంది. ఇందులో ఈ ఫోన్ చిప్ సెట్ మరియు ర్యామ్ వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :