భారీ ఫీచర్ లతో ఈరోజు విడుదలకు సిద్ధమైన Realme GT6 స్మార్ట్ ఫోన్.!

Updated on 20-Jun-2024
HIGHLIGHTS

Realme GT6 ఈరోజు ఇండియాలో విడుదల కాబోతోంది

AI మరియు పవర్ ఫుల్ ఫీచర్ లతో లాంచ్ కాబోతోంది

ఈ ఫోన్ గెస్ ప్రైస్ తో కంపెనీ పెట్టిన పోస్ట్ ధరను తెలియ చేస్తోంది

రియల్ మీ చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న ఫ్లాగ్ షిప్ షార్ట్ ఫోన్ Realme GT6 ఈరోజు ఇండియాలో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మరియు పవర్ ఫుల్ ఫీచర్ లతో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ ప్రధాన స్పెక్స్ మరియు ఫీచర్ లతో చాలా కాలంగా రియల్ మీ అటపట్టిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే చాలా మంది లీక్స్టర్ లు మరియు నిపుణులు అంచనా ధర వివరాలను కూడా నెట్టింట్లో లీక్ చేశారు. అయితే, ఈ ఫోన్ గెస్ ప్రైస్ తో కంపెనీ పెట్టిన పోస్ట్, ఈ ఫోన్ అంచనా ధరను తెలియ చేస్తోంది.

Realme GT6: లాంచ్ & ఫీచర్లు

రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు లాంచ్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ ఫోన్ ను ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుండి ఈ ఫోన్ Pre-Orders లను కూడా మొదలు అవుతాయని కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది.

ఈ ఫోన్ ను 1.65M+ AnTuTu స్కోర్ కలిగిన క్వాల్కమ్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8s Gen 3 తో తీసుకు వస్తోంది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 ఫాస్ట్ రెస్పాన్స్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ రెండు వివరాలతో ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ చాలా గొప్పగా ఉంటుందని క్లియర్ చేసింది.

Realme GT6 Features

ఈ ఫోన్ లో అందించిన కెమెరా వివరాలలు కూడా కంపెనీ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ ను OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT – 808 మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ కెమెరాతో AI సపోర్ట్ ఉన్నట్లు మరియు AI నైట్ విజన్ తో గొప్ప వీడియోలను పొందవచ్చని కూడా రియల్ మీ తెలిపింది.

Also Read: బడ్జెట్ ధరలో మ్యాగ్నెటిక్ వైర్లెస్ Power Bank ను లాంచ్ చేసిన యునిక్స్

అంతేకాదు, ఈ ఫోన్ లో అందించి బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ వివరాలు కూడా టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుందని తెలిపింది.

Realme GT6: ప్రైస్

రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ గెస్ ప్రైస్ పోస్ట్ ను కంపెనీ విడుదల చేసింది. ఈ పోస్ట్ లో రూ. 49,999 రూపాయల అమౌంట్ ను రాసి కొట్టేసినట్లు చూపించింది. అంటే, ఈ ఫోన్ ధర అంతకంటే తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంటుందని కంపెనీ సింబాలిజంగా చెప్పినట్టు అనిపిస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :