Realme GT6: ఈ టాప్-5 ఫీచర్లతో వచ్చిన రియల్ మీ ఫ్లాగ్ షిప్ ఫోన్.!

Updated on 20-Jun-2024
HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Realme GT6 ను విడుదల చేసింది

భారీ ఫీచర్లు మరియు ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసినట్లు తెలిపింది

ఈ ఫోన్ ను ఈ టాప్ 5 ఫీచర్ లతో అందించింది

Realme GT6: రియల్ మీ ఈరోజు తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లు మరియు ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసినట్లు తెలిపింది. మరి ఈ ఫోన్ లో రియల్ మీ అందించిన ఫీచర్లలో టాప్ 5 ఫీచర్లు మరియు ఈ ఫోన్ ప్రైస్ వంటి అన్ని వివరాలు తెలుసుకుందామా.

Realme GT6: ధర

రియల్ మీ ఈ ఫోన్ ను రూ. 40,999 రూపాయల ప్రారంభ ధరతో (8GB + 256GB) బేసిక్ వేరియంట్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (12GB + 256GB) రూ. 42,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఒక చివరీ మరియు హై ఎండ్ (16GB + 512GB) వేరియంట్ ను రూ. 44,999 ధరతో లాంచ్ చేసింది. జూన్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై గొప్ప ఆఫర్లు కూడా అందించింది.

ఆఫర్స్

ఈ ఫోన్ ను SBI, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 4,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను రియల్ మీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ Pre-Orders ని ఈరోజు నుండే మొదలు పెట్టింది రియల్ మీ.

Realme GT6: టాప్-5 ఫీచర్లు

స్క్రీన్

ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ AMOELD డిస్ప్లేని 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 1.5K రిజల్యూషన్ సపోర్ట్ తో అందించింది. స్క్రీన్ లో Dolby Vision సపోర్ట్ తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది.

ప్రోసెసర్

ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 తో పని చేస్తుంది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ మరియు Cortex X4 కోర్స్ తో వస్తుంది మరియు 1.6M+ AnTuTu స్కోర్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Realme GT6 Top 5 features

ర్యామ్ & స్టోరేజ్

ఈ స్మార్ట్ ఫోన్ 16GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ సపోర్ట్ తో పాటు 512GB ఫాస్ట్ రెస్పాన్స్ UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ఈ ఫోన్ చిప్ సెట్ మరియు ర్యామ్ సహాయంతో గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: Aadhaar Biometric Lock: మీ అనుమతి లేకుండా మీ ఆధార్ ని ఎవరూ టచ్ చెయ్యలేరు.!

కెమెరా

ఈ ఫోన్ లో అద్భుతమైన కెమెరా సెటప్ మరియు ఫీచర్లు ఉన్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP Sony LYT-808 మెయిన్ సెన్సార్, 8MP Sony IMX 355 అల్ట్రా వైడ్ మరియు 50MP Samsung S5KJN5 సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ లో ముందు 32MP Sony IMX615 సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 60fps వద్ద 4K వీడియోలను, సెల్ఫీ కెమెరాతో 30fps వద్ద 4K వీడియోలను షూట్ చేయవచ్చని రియల్ మీ తెలిపింది. అంతేకాదు, అనేకమైన ఫిల్టర్స్ మరియు AI సపోర్ట్ తో గొప్ప ఫోటోలను అందిస్తుందని కూడా రియల్ మీ తెలిపింది.

బ్యాటరీ

రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీని అత్యంత వేగంగా ఛార్జ్ చేసే సత్తా కలిగిన 120W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :