Realme GT6: రియల్ మీ మొదటి AI ఫ్లాగ్ షిప్ కిల్లర్ ఫోన్ వచ్చేస్తోంది.!
Realme GT6: గ్లోబల్ లాంచ్ డేట్ ను ఈరోజు కంపెనీ అందించింది
జూన్ 20వ తేదీన ఇండియాతో తో పాటు గ్లోబల్ మార్కెట్ లో కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ ఎలా ఉండబోతోందనే అవగాహన కలిగించింది
Realme GT6: గ్లోబల్ లాంచ్ ను ఈరోజు కంపెనీ అందించింది. రియల్ మీ GT6 స్మార్ట్ ఫోన్ ను జూన్ 20వ తేదీన ఇండియాతో తో పాటు గ్లోబల్ మార్కెట్ లో కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ గ్లోబల్ X అకౌంట్ ను ఈ ఫోన్ లాంచ్ వివరాలతో రియల్ మీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ టీజింగ్ ఇమేజ్ తో కంపెనీ ఈ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ ఎలా ఉండబోతోందనే అవగాహన కలిగించింది.
Realme GT6 Launch
రియల్ మీ గ్లోబల్ X అకౌంట్ నుండి ఈరోజు కొత్త ట్వీట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ ట్వీట్ నుండి ఈ ఫోన్ ఇమేజ్ ను కూడా రివీల్ చేసింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు పవర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ మొదటి AI ఫ్లాగ్ షిప్ కిల్లర్ ఫోన్ గా వస్తున్నట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది.
Also Read: Price Cut: వన్ ప్లస్ 11R పై రూ. 12,000 భారీ తగ్గింపు.!
Realme GT6 టీజర్ ఇమేజ్ ఏమి చెబుతోంది?
రియల్ మీ GT6 టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ అర్ధం అవుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ వెనుక భాగం పూర్తిగా కనిపించేలా కంపెనీ ఈ టీజర్ ఇమేజ్ ను అందించింది. ఈ ఫోన్ ను 50MP AI CAM OIS కెమెరా సెటప్ తీసుకొస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది మరియు జతగా ఫ్లాష్ లైట్ ను కూడా వుంది.
ఈ ఫోన్ చూడటానికి రియల్ మీ GT 6T మాదిరి గ్లాస్సి బ్యాక్ డిజైన్ తో కన్పిస్తోంది. అయితే, వెనుక పెద్ద రౌండ్ సెపరేట్ బంప్ కలిగిన ట్రిపుల్ కెమెరాతో ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ కూడా రియల్ మీ GT 6T వంటి కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ AI పవర్ తో వస్తున్న పవర్ ఫుల్ ఫోన్ గా కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో అందించిన AI పై సైన్ చూస్తుంటే, ఈ ఫోన్ Gemini AI పవర్ తో పని చేసే ఫోన్ గా కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ ఈ ఫోన్ ఇతర వివరాల గురించి ప్రస్తుతానికి ఎంటువంటి అనౌన్స్ అందించలేదు. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ అందించింది. రేపు ఈ ఫోన్ కు సంబంధించిన కొత్త స్టేట్ మెంట్ ను ను అనౌన్స్ చేస్తుందని ఈ పేజ్ లో తెలిపింది.