Realme GT Neo 3T 80W: రేసింగ్ ఫ్లాగ్ డిజైన్ మరియు SD 870 తో లాంచ్ అయ్యింది.!

Updated on 16-Sep-2022
HIGHLIGHTS

Realme GT Neo 3T 80W ని ఎట్టకేలకు ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను రేసింగ్ ఫ్లాగ్ డిజైన్ మరియు స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ డిస్ప్లే, ఛార్జింగ్ మరియు ఆకర్షణీయమైన ఇతర ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టింది

Realme చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న GT Neo 3T 80W ని ఎట్టకేలకు ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రేసింగ్ ఫ్లాగ్ డిజైన్ మరియు స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ డిస్ప్లే, ఛార్జింగ్ మరియు ఆకర్షణీయమైన ఇతర ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఫోన్ గురించి మీరు తెల్సుకోవల్సిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి.

Realme GT Neo 3T 80W: ధర

Realme GT Neo 3T 80W స్టార్టింగ్ వేరియంట్ (6GB + 128GB) ధర రూ.29,999 గా నిర్ణయించింది. అయితే, (8GB + 256GB) వేరియంట్ ధర  రూ.31,999 కాగా, హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ధర మాత్రం రూ.33,999. ఈ ఫోన్ సెప్టెంబర్ 23 నుండి Flipkart మరియు రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.           

Realme GT Neo 3T 80W: స్పెక్స్

రియల్‌మీ జిటి నియో 3టి 80W స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగివుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది. ఈ ఛార్జింగ్ టెక్ తో కేవలం 12 నిముషాల్లోనే 50% ఛార్జ్ చెయ్యగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :