Realme GT 7 Pro : ప్రీ బుకింగ్ మొదలు పెట్టిన కంపెనీ.. కంప్లీట్ ఫీచర్స్ కూడా విడుదల.!

Realme GT 7 Pro : ప్రీ బుకింగ్ మొదలు పెట్టిన కంపెనీ.. కంప్లీట్ ఫీచర్స్ కూడా విడుదల.!
HIGHLIGHTS

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ఈ నెల 28న విడుదల అవుతుంది

రియల్ మీ GT 7 ప్రో ప్రీ బుకింగ్ ను కూడా అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను రూ. 999 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 28వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ప్రీ బుక్ తో పాటు ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ను కూడా బయట పెట్టింది.

Realme GT 7 Pro : ప్రీ-బుకింగ్

రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ నవంబర్ 28వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ను కంపెనీ ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా నుంచి రూ. 999 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను లాంచ్ తర్వాత కొనుగోలు చేసే సమయంలో ఈ అమౌంట్ అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో క్రెడిట్ చేయబడుతుందని అమెజాన్ తెలిపింది.

ఈ ఫోన్ ఎన్ని వేరియంట్లలో వస్తుంది?

అమెజాన్ ఇండియా ఈ ఫోన్ ప్రీ బుక్ కోసం అందించిన పేజీ నుంచి ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లంచ్ అవుతుందని క్లియర్ అయ్యింది. ఈ ఫోన్ 12GB + 256GB బేసిక్ వేరియంట్ మరియు 16GB + 512GB హై ఎండ్ వేరియంట్లలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ గెలాక్సీ గ్రే మరియు మార్స్ ఆరంజ్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Realme GT 7 Pro : ఫీచర్స్

రియల్ మీ GT 7 ప్రాడ్ స్మార్ట్ ఫోన్ లో 6.78 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ 8T LTPO స్క్రీన్ వుంది. ఇది 120% DCI-P3 కలర్ గాముట్ కలిగి 1.5 రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది 2600Hz టచ్ రెస్పాన్స్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. శామ్సంగ్ తో జతగా రియల్ మీ ఈ ఫోన్ ను ప్రపంచంలో మొదటి ECO OLED plus ఫ్లాట్ ఫోన్ గా నిర్మించినట్లుగా రియల్ మీ తెలిపింది.

Realme GT 7 Pro Features

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది మరియు ఇందులో మూడు Sony కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX906 మెయిన్, 50MP Sony IMX 882 పెరిస్కోప్ మరియు 112 డిగ్రీలSony IMX355 అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ 120X వరకు గొప్ప AI డిజిటల్ జూమ్ ను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఇందులో అండర్ వాటర్ కెమెరా మొద కూడా వుంది.

Also Read: LG OLED smart tv పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

రియల్ మీ ఈ ఫోన్ ను Snapdragon 8 Elite సూపర్ ఫాస్ట్ ప్రోసెసర్ జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మరింత వేగంగా ఉండడానికి ఈ ఫోన్ ను Next AI సపోర్ట్ తో కూడా అందించింది. ఈ ఫోన్ ను 5600mAh హెవీ బ్యాటరీని 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo