Realme GT 7 Pro: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు కెమెరాతో లంచ్ అయ్యింది.!
Realme GT 7 Pro ఈరోజు ఇండియాలో విడుదల చేయబడింది
Snapdragon 8 Elite చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్
ఈ స్మార్ట్ ఫోన్ మరిన్ని పవర్ ఫుల్ ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది
Realme GT 7 Pro ఈరోజు ఇండియాలో విడుదల చేయబడింది. క్వాల్కమ్ యొక్క Snapdragon 8 Elite చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ గా ఇది చరిత్రకెక్కింది. కేవలం చిప్ సెట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ ఫోన్ మరిన్ని పవర్ ఫుల్ ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఈరోజు ఇండియాలో సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Realme GT 7 Pro: ఫీచర్స్
రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ గా ఇది నిలుస్తుంది. ఈ ఫోన్ ను 16GB LPDDR5X ర్యామ్ మరియు 28GB వరకూ Dynamic RAM సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో 256GB మరియు 512GB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ను కూడా అందించింది.
ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లో 6.78 ఇంచ్ ECO OLED క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ ను అందించింది. ఈ స్క్రీన్ Dolby Atmos మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్క్రీన్ 1.5 రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్ మరియు 6500 నిట్స్ పిక్ బ్రైట్నెస్ తో పాటు అల్ట్రా సోనిక్ ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా కలిగి వుంది.
ఈ రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వెనుతికె ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP Sony IMX906 మెయిన్, 50MP పెరిస్కోప్ పోర్ట్రైట్ (Sony IMX882) మరియు 8MPఅల్ట్రా వైడ్ కెమెరా ని కలిగి వుంది. అలాగే, ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 24fps వద్ద 8K వీడియోలు, 30/ 60fps వద్ద 4K లను షూట్ చేయవచ్చని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ తో అండర్ వాటర్ ఫోటోలు మరియు వీడియోలు షూట్ చేయచ్చు అని కూడా రియల్ మీ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ Next Ai సపోర్ట్ తో కూడా నవస్తుంది.
ఈ రియల్ మీ ఫోన్ లో పెద్ద 5640 mAh బ్యాటరీ ఉంది మరియు ఈ ఫోన్ 120W SUPER VOOC వస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ తో స్విమ్మింగ్ ఫూల్ లోపడిన ఎటువంటి నష్టం లేకుండా ఉంటుందని, అంటే గొప్ప వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
Realme GT 7 Pro: ప్రైస్
రియల్ మీ GT 7 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (12GB + 256GB) వేరియంట్ ని రూ. 59,999 ధరతో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ యొక్క హై ఎండ్ (16GB + 512GB) వేరియంట్ ని రూ. 65,999 ధరతో లాంచ్ చేసింది. నవంబర్ 28వ తేది మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
Also Read: Redmi A4 5G First Sale: రేపటి నుంచి ప్రారంభం అవుతున్న రెడ్ మీ బడ్జెట్ 5జి ఫోన్ సేల్.!
ఆఫర్స్ :
ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ పై గొప్ప ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ అందించే బ్యాంక్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై 12 నెలల No COST EMI ఆఫర్ ను అందించింది దీనికోసం ఈ ఫోన్ ను నెలకు రూ. 5,000 రూపాయలు చెల్లించే EMI ని ఎంచుకోవాలి.