భారీ ఫీచర్స్ తో విడుదలైన Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ : ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

భారీ ఫీచర్స్ తో విడుదలైన Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ : ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో రియల్ మీ విడుదల చేసింది

రియల్ మీ GT 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ తో వచ్చింది

8K వీడియో షూట్ చేయగల Sony సెన్సార్ తో ఈ ఫోన్ ను అందించింది

Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో రియల్ మీ విడుదల చేసింది. ఈ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో పాటు 24 fps వద్ద 8K వీడియో షూట్ చేయగల కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో రియల్ మీ విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ విడుదల అయ్యింది చైనా మార్కెట్ లో అనుకోండి. కానీ, ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో కూడా లాంచ్ కోసం సిద్ధం అయ్యింది. అందుకే, ఈ ఫోన్ యొక్క అంచనా ధర మరియు ఫీచర్స్ ముందే తెలుసుకునే అవకాశం వుంది.

Realme GT 7 Pro : ఫీచర్స్ (చైనా)

రియల్ మీ GT 7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.78 ఇంచ్ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ లతో పాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ కు జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS4.0 ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది.

Realme GT 7 Pro launched

ఈ ఫోన్ లో 50MP Sony IMX906 OIS ప్రధాన సెన్సార్, 50 MP Sony IMX882 అల్ట్రా వైడ్ పెరిస్కోప్ సెన్సార్ మరియు మూడవ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 24fps వద్ద 8K వీడియో, 60fps వద్ద 4K వీడియోలు షూట్ చేసే సపోర్ట్ ను కలిగి ఉందని రియల్ మీ తెలిపింది.

ఈ ఫోన్ లో Hi-Res Audio సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ను 120W స్మార్ట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో రియల్ మీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా చాలా స్లీక్ మరియు సరికొత్త మార్స్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో ఫుల్ వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది.

Also Read: BSNL Super Plan: రోజుకు రూ. 4.50 పైసలకే అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Realme GT 7 Pro : ప్రైస్ (చైనా)

రియల్ మీ GT 7 ప్రో ఫోన్ ను చైనా మార్కెట్ లో 4 వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో, బేసిక్ 12GB + 256GB వేరియంట్ ను ¥3599 (సుమారు రూ. 42,500) ధరతో 16GB + 1TB వేరియంట్ ను ¥4799 (సుమారు రూ. 57,000) ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే చం మార్కెట్ లో సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo