Realme GT 6T ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠమైన బ్రైట్నెస్ డిస్ప్లేతో వస్తోంది.!

Updated on 17-May-2024
HIGHLIGHTS

Realme GT 6T ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠమైన బ్రైట్నెస్ డిస్ప్లేతో వస్తోంది

ఈ ఫోన్ ను 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 8T LTPO AMOLED డిస్ప్లే తో తీసుకువస్తున్నట్లు తెలిపింది

ఈ డిస్ప్లే 1-120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది

Realme GT 6T ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠమైన బ్రైట్నెస్ డిస్ప్లేతో వస్తోందని కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ మరియు ప్రోసెసర్ వివరాలతో ఇప్పటి వరకు టీజింగ్ చేసిన రియల్ మీ, ఇప్పుడు ఈ ఫోన్ డిస్ప్లేతో టీజింగ్ మొదలు పెట్టింది. కంపెనీ చెప్పిన నెంబర్లు చూస్తుంటే, ఇప్పటి వరకూ ఏ స్మార్ట్ ఫోన్ కలియు లేని బ్రైట్నెస్ ను ఈ ఫోన్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు క్లియర్ గా అర్ధమవుతోంది.

ఏమిటా Realme GT 6T డిస్ప్లే?

రియల్ మీ GT 6T కోసం కొత్తగా అందించిన కొత్త టీజర్ ద్వారా ఈ ఫోన్ ను 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 8T LTPO AMOLED డిస్ప్లే తో తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇంత బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా ఈ ఫీచర్ తో ఫోన్ లాంచ్ అవ్వలేదు మరియు ఇదే మొదటిది అవుతుంది, అని కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది.

Realme GT 6T Display

ఈ డిస్ప్లే 1-120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే అత్యంత కఠినమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణతో ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేసింది.

Also Read: ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!

Realme GT 6T ఇంకా ఏమి ఫీచర్స్ కలిగి వుంది?

రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ Snapdragon 7+ Gen 3 ప్రోసెసర్ ను కలిగి వుంది. ఈ విషయాన్ని కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది మరియు ఇది 1.5M AnTuTu స్కోర్ తో ఉంటుందని కూడా తెలిపింది.

ఈ ఫోన్లో అందించిన బ్యాటరీ వివరాలను కూడా కంపెనీ టీజర్ ద్వారా బయట పెట్టింది. ఈ ఫోన్ లో 120W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గొప్ప కూలింగ్ టెక్ అందించినట్లు కూడా చెబుతోంది.

ఈ రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ లో 9- Layer కూలింగ్ సిస్టం ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు, అతిపెద్ద డ్యూయల్ వేపర్ ఛాంబర్ ఈ ఫోన్ కలిగి ఉన్నట్లు కూడా చెప్పింది. హెవీ గేమింగ్ సమయంలో కూడా ఈ ఫోన్ ను చల్లగా ఉంచడానికి ఈ ఫీచర్ సహకరిస్తుందని రియల్ మీ తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :