Realme GT 6T: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!

Realme GT 6T: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో టీజింగ్ స్టార్ట్ చేసింది

ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది

120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది

Realme GT 6T: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఇప్పటికే అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది.

Realme GT 6T Launch

రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా Amazon టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుండి సేల్ అవుతుంది.

Realme GT 6T Features

రియల్ మీ ఈ ఫోన్ ఒక్కొక్క ఫీచర్ తో టీజింగ్ చేస్తోంది. ముందుగా ఈ ఫోన్ డిజైన్ తో కూడిన టీజర్ ఇమేజ్ ను అందించింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్నట్లు క్లియర్ చేసింది. ఈ ఫోన్ సన్నని మరియు షైనీ డిజైన్ లో వెనుక డ్యూయల్ కెమెరా తో కనిపిస్తోంది.

Realme GT 6T Features
Realme GT 6T Features

ఈ ఫోన్ Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో ఇండియాలో విడుదల కానున్న మొదటి ఫోన్ అని కూడా కంపెనీ తెలిపింది. ఈ చిప్ సెట్ 1.5 M AnTuTu స్కోర్ తో పర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా రియల్ మీ టీజింగ్ ద్వారా తెలిపింది.

Also Read: రెండు Mobile Number నెంబర్ లు వాడే వారికి ఇక దబిడి దిబిడే.!

అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన బ్యాటరీ వివరాలను కూడా టీజింగ్ ద్వారా వేల్లడించింది. GT 6T స్మార్ట్ ఫోన్ 120W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీతో అందిస్తున్నట్లు తెలిపింది.

ఇక ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ Curved డిస్ప్లే మరియు టైప్-C ఛార్జ్ పోర్ట్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరిన్ని రియల్ మీ వెల్లడించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo