Realme GT 5: Pro-XDR డిస్ప్లే మరియు 240W ఫాస్ట్ ఛార్జ్ తో లాంచ్ అవుతోంది.!

Realme GT 5: Pro-XDR డిస్ప్లే మరియు 240W ఫాస్ట్ ఛార్జ్ తో  లాంచ్ అవుతోంది.!
HIGHLIGHTS

Realme GT 5 ఫోన్ ను 240W ఫాస్ట్ ఛార్జ్ తో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

రియల్ మి GT 5 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ విలక్షణమైన డిజైన్ తో అందించింది

Realme GT 5 ఫోన్ లో PRO-XDR డిస్ప్లే ఉన్నట్లు రియల్ మి టీజింగ్ చెబుతోంది

రియల్ మి ఈసారి భారీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది యావత్ ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించింది. అదే రియల్ మి సరికొత్తగా విడుదల చేయబోతున్న Realme GT 5 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ఆగష్టు 28వ తేదీ చైనా మార్కెట్ లో  విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 240W ఫాస్ట్ ఛార్జ్ తో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రియల్ మి అప్ కమింగ్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కేవలం ఛార్జ్ టెక్ లో మాత్రమే కాకుండా డిజైన్, కెమేరా మరియు మరిన్ని కేటగిరీలలో టాప్ ఫీచర్లతో వస్తోందని కూడా రియల్ మి గొప్పగా చెబుతోంది. ఈ రియల్ మి అప్ కమింగ్ హై ఎండ్ ఫోన్ విశేషాలు ఏంటో తెలుసుకోండి మరి. 

Realme GT 5 : ప్రత్యేకతలు 

రియల్ మి GT 5 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ విలక్షణమైన డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా వచ్చిన Realme GT Neo 5 వంటి RGB లైట్ తో ఈ ఫోన్ ను తీసుకువస్తోంది. అయితే, ఈ ఫోన్ డిజైన్ ను మాత్రం మరింత ఆకర్షణీయంగా అందించింది. అయితే, ఈ లైట్ ఏవిధంగా పనిచేస్తుంది తెలియాల్సి వుంది. రియల్ మి చైనా వెబ్సైట్ ద్వారా చేస్తున్న టీజింగ్ ద్వారా ఈ ఫోన్ వివరాలు ఇప్పుడు బయటకి వచ్చాయి. 

Realme GT 5 ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ అందించ గల PRO-XDR డిస్ప్లే ఉన్నట్లు రియల్ మి టీజింగ్ చెబుతోంది. ఈ PRO-XDR ఫీచర్ On మరియు OFF తో డిస్ప్లే పైన ఎటువంటి వివరాలు కనిపిస్తున్నాయో కూడా టీజర్ లో చూపించింది. డిస్ప్లే కోసం   ఈ డిస్ప్లే పైన సెంటర్ లో పంచ్ హోల్ కలిగి వుంది. 

Realme GT 5 (Pro-XDR) Display

ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 2 తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ను 5240mAh బ్యాటరీతో 240W SUPERVOOC S ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో తీసుకు వస్తున్నట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 24GB LPDDR5X హెవీ ర్యామ్ మరియు 1TB (UFS 4.0) హెవీ స్టోరేజ్ ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.

ఇవన్నీ చూస్తుంటే Realme GT 5 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న చాలా హైఎండ్ ఫోన్లకు భారీ పోటీగా ఈ ఫోన్ ను తీసుకు వస్తునట్లు అనిపిస్తోంది.

Image Source: Realme china wesite

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo