చైనాలో రీసెంట్ గా విడుదలైన Realme GT 5 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను ఒక ఊపేస్తోంది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ లో కేవలం రెండు గంటల్లోనే 30 వేలకు పైగా స్మార్ట్ ఫోన్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. Realme GT 5 5G ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ధర కూడా ప్రిమియంగానే వుంది. అయినా కూడా Realme GT 5 5G ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ Realme లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కొనడానికి యూజర్లను ఆకర్షించే 5 ముఖమైన (Top 5 Features) కారణాలున్నాయి. అవేమిటో ఒక తెలుసుకుందాం పదండి.
రియల్ మి GT 5 5G స్మార్ట్ ఫోన్ 5 భారీ ఫీచర్స్ తో మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ ఐదు ముఖ్యమైన ఫీచర్స్ లను దృష్టిలో ఉంచుకొని యూజర్లు ఈ ఫోన్ ను కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇవే ఆయా ముఖ్యమైన ఫీచర్స్
ఈ రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 1.5K ( 2772×1240) హై రిజల్యూషన్ కలిగిన 6.74 ఇంచ్ Pro-XDR డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 2000Hz ఇంటెలిజంట్ తో బ్లేజింగ్ స్పీడ్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ డిస్ప్లే DCI-P3 (100%) మంచి యాక్యురేట్ కలర్స్ అందిస్తుంది.
GT 5 5G స్మార్ట్ ఫోన్ క్వల్కమ్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 2 తో శక్తితో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ అత్యధమైన antutu స్కోర్ చేసిన పవర్ ఫుల్ చిప్ సెట్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుంది.
ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ కి జతగా 24GB RAM మరియు 1TB Storage లతో ఈ ఫోన్ అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ అందించ అందించ గలదు.
రియల్ మి జిటి 5 5జి ఫోన్ లో 50MP (Sony IMX 890 OIS) మెయిన్ కెమేరా 8MP Super Wide Angle కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలతో ట్రిపుల్ కేమెరా సిస్టంతో వచ్చింది. అంతేకాదు, ఈ కెమేరా సిస్టమ్ పక్కనే Awakening Aura System Pro అనే లైట్ నోటిఫికేషన్ సిస్టం అందించింది. ఇది చూడడానికి ఆకర్షణగా వుంది మరియు 26 రంగులలో మారుతుంది కూడాను.
Realme GT 5 5G స్మార్ట్ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన హెవీ బ్యాటరీని కలిగి వుంది. కేవలం 30 సెకన్ల ఛార్జ్ తో 2 గంటలు కాలింగ్ చేయగలిగేంత శక్తిని ఛార్జ్ చెయ్యగలదని కంపెనీ చెబుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో CNY 3799 (సుమారు రూ.43,500) ధరతో చైనా మార్కెట్ లో విడుదలయ్యింది.