MWC 2023: 240W భారీ ఛార్జింగ్ సపోర్ట్ తో Realme GT3 ని ఆవిష్కరించిన రియల్ మి.!

Updated on 05-Mar-2023
HIGHLIGHTS

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ 2023

రియల్ మి అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్ తో తన అప్ కమింగ్ ఫోన్ ను ఆవిష్కరించింది

Realme GT3 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంటుంది

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ 2023 నుండి రియల్ మి అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్ తో తన అప్ కమింగ్ ఫోన్ ను ఆవిష్కరించింది. అదే, Realme GT3 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంటుంది. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఫోనుగా ఇది నిలుస్తుంది.  ఈ ఫోన్ లో మరిన్ని ఆసక్తికర వివరాలు మరియు విషయాలు కూడా  రియల్ మి జత చేసింది. అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా.

Realme GT3: టాప్-3 ఫీచర్స్

రియల్ మి GT3 మొదటి టాప్ ఫీచర్ గా 240W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్. రియల్ మి ఈ ఫోన్ ను 4,600 mAh బ్యాటరీతో అందించింది. ఇందులో అందించిన 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఈ ఫోన్ పూర్తి ఛార్జింగ్ ను కేవలం 9 నిముషాల 30 సెకండ్స్ లోనే చేయగలదని కంపెనీ అంచనా వేసి చెబుతోంది. అయితే, ఈ ఛార్జింగ్ అడాప్టర్ మాత్రం రియల్ మి యొక్క 150W అడాప్టర్ కంటే చిన్నగానే అందించింది. కానీ, వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్, ఫైర్ ప్రూఫ్ డిజైన్, 13 టెంపరేచర్ డిజైన్ మరియు 60 లేయర్స్ ప్రొటక్షన్ వంటి అన్ని సేఫ్టీ మెజర్స్ తో ఈ ఫోన్ వస్తుంది. 

ఒక రెండవ టాప్ ఫీచర్ ఈ ఫోన్ లో అందించిన Snapdragon 8+ Gen 1 చిప్ సెట్. ఈ చిప్ సెట్ 4nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది. ఈ ప్రోసెసర్ పనితనం మరియు ఎనర్జీ సేవింగ్ గురించి యూజర్ల నుండి మంచి రివ్యూ లను అందుకుంది. 

ఇక మూడవ టాప్ ఫీచర్ గా పల్స్ ఇంటర్ ఫేజ్ గా పిలవబడుతున్న యూనిక్ డిజైన్ గురించి చెప్పవచ్చు. ఎందుకంటే, ఛార్జింగ్ స్టేటస్, కాల్ మరియు నోటిఫికేషన్ ఇండికేషన్ ల కోసం రకరకాలైన లైట్ ఎఫెక్ట్ లను చూపిస్తుంది. ఇందులో, మీరు 25 వరకూ కలర్  అప్షన్స్, 2 రకాల రిథమ్స్ మరియు 5 రకాల లైటింగ్ స్పీడ్ మోడ్ లు ఉన్నాయి. కాబట్టి, మీకు నచ్చిన లేదా తగిన విధంగా మీరు ఈ ఎఫెక్ట్'లను సెట్ చేసుకునే వీలుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :