Realme C63: విడుదల కంటే ముందే లీకైన ప్రైస్ మరియు స్పెక్స్.!
రియల్ మీ సి 63 ను ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేస్తోంది
ఈ ఫోన్ ను ముందుగా మలేషియా మార్కెట్ లో విడుదల చేసింది
లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు కూడా రియల్ మీ బయటపెట్టేసింది
Realme C63: 2024 మే నెలలో రియల్ మీ మలేషియా మరియు ఇండోనేషియా మార్కెట్ లో విడుదల చేసిన రియల్ మీ సి 63 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఇండియాలో కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ చూడటానికి ఐఫోన్ 13 మాదిరి ట్రిపుల్ రియర్ కెమెరా డైజిన్ తో కనిపిస్తుంది మరియు చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు కూడా రియల్ మీ బయటపెట్టేసింది.
Realme C63: ధర
రియల్ మీ సి 63 స్మార్ట్ ఫోన్ ను Flipkart సేల్ పార్ట్నర్ గా తీసుకువస్తోంది. అందుకే, ఈ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్స్ తో ఫ్లిప్ కార్ట్ నుండి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ బ్యానర్ నుంచి ఈ ఫోన్ ప్రైస్ ను మరియు మైక్రో సైట్ పేజీ నుండి ఫీచర్ లతో ఆటపట్టిస్తోంది. ఈ ఫోన్ ను రూ. 8,999 రూపాయల ధరలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ టీజర్ పేజి నుండి అనౌన్స్ చేసింది.
ఈ ఫోన్ యొక్క (4GB + 128GB) వేరియంట్ ను ఈ ధరతో విడుదల చేస్తున్నట్లు ఇందులో తెలిపింది. రియల్ మీ ఈ ఫోన్ ను జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది మరియు అదే ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకువస్తోంది.
Also Read: CMF Phone 1 కీలకమైన ఫీచర్స్ అనౌన్స్.. 16GB ర్యామ్ తో వస్తోంది.!
Realme C63: ఫీచర్లు
రియల్ మీ ఈ ఫోన్ ను కంఫర్టబుల్ టచ్ ప్రీమియం లెదర్ బ్యాక్ తో తీసుకు వస్తుంది. అంతేకాదు., ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ ను రెండు కలర్ వేరియంట్ లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ UNISOC T612 చిప్ సెట్ మరియు 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ ను అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ Android 14 తో అందించే అవకాశం వుంది.