Realme C63 5G స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను అండర్ 10K ధరలో తగిన ఫీచర్స్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ మార్కెట్ లో ప్రస్తుతం 10 వేల బడ్జెట్ లో లభిస్తున్న చాలా 5జి ఫోన్ లకు పోటీగా తీసుకు వచ్చినట్లు క్లియర్ గా అర్ధం అవుతోంది. రియల్ మీ చాలా దూకుడుగా తీసుకు వచ్చిన ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
రియల్ మీ ఈ ఫోన్ ను కేవలం రూ. 10,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 128GB) ను ఈ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 11,999 ధరతో, (8GB + 128GB) వేరియంట్ ను రూ. 12,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను మరింత చవక ధరకు అందుకునేలా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా ఈ ఫోన్ తో జత చేసింది.
రియల్ మీ సి 63 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI, HDFC మరియు SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ను 10 వేల కంటే తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Flipkart Sale: భారీ ఆఫర్ LED రేటుకే 4K QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!
ఈ కొత్త ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ తోనే అందించింది. ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన LCD స్క్రీన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesnity 6300 చి పీసెట్ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 4GB / 6GB / 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో 32MP మెయిన్ మరియు డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 500mAh బ్యాటరీ మరియు 10W క్విక్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.