Realme C61 ఫోన్ లాంచ్ కంటే ముందే ధర ప్రకటించిన రియల్ మీ.!

Updated on 27-Jun-2024
HIGHLIGHTS

Realme C61 విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది

విడుదల కంటే ముందే ఈ ఫోన్ యొక్క ప్రైస్ ను కంపెనీ రివీల్ చేసింది

ఈ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ ఆర్మోర్ షెల్ టఫ్ బిల్డ్ అవుతుందని కంపెనీ ఆటపట్టిస్తోంది

Realme C61 స్మార్ట్ ఫోన్ ను జూన్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. అయితే, విడుదల కంటే ముందే ఈ ఫోన్ యొక్క ప్రైస్ ను కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ ను రియల్ మీ అధికారిక X అకౌంట్ ద్వారా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా రివీల్ చేసింది. ఈ ఫోన్ ను చాలా గట్టిగా ఉండేలా పటిష్టమైన ఆర్మోర్ షెల్ టఫ్ బిల్డ్ తో లాంచ్ చేస్తున్నట్లు చేస్తున్న టీజింగ్ మరియు ప్రైస్ వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ 10 వేల బడ్జెట్ లో గొప్ప పోటీదారుడు అయ్యేలా కనిపిస్తోంది.

Realme C61: ప్రైస్

Realme C61

ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుండి ఈ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ ఆర్మోర్ షెల్ టఫ్ బిల్డ్ అవుతుందని కంపెనీ ఆటపట్టిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను కేవలం రూ. 7,699 రూపాయలకే పొందండి అని కూడా చెబుతోంది. అయితే, ఇది సేల్ ప్రైస్ అవుతోంది లేక బ్యాంక్ ఆఫర్లు లేదా మరింకేదైనా ఆఫర్లతో కూడిన ధర అనేది చెప్పలేదు. ఒకవేళ ఇది డైరెక్ట్ సేల్ ప్రైస్ అయితే మాత్రం ఈ ఫోన్ ఈ ధరలో గట్టి పోటీదారుడు అవుతుందని అంచనా వేస్తున్నారు.

Realme C61: ఫీచర్లు

రియల్ మీ సి 61 స్మార్ట్ ఫోన్ లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ ఫ్రేమ్ డిజైన్ ఉన్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉండేలా IP54 రేటింగ్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఉన్న డిస్ప్లేని గట్టి గ్లాస్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఓవరాల్ గా ఈ ఫోన్ ను కఠినమైన ఆర్మోర్ షెల్ టఫ్ బిల్డ్ తో అందిస్తున్నట్లు రియల్ మీ ఆటపటిస్తోంది.

Also Read: OnePlus Smart Tv పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్: 22 వేలకే పెద్ద 4K టీవీ అందుకోండి.!

ఇక ఈ ఫోన్ లో అందించిన ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 32MP మెయిన్ కెమెరా మరియు దీనికి జతగా LED ఫ్లాష్ లైట్ వుంది. ఈ ఫోన్ లో ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ గా నడుస్తున్న 5000mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news