Realme C61 ఫోన్ ను కేవలం రూ. 7,499 ధరతో టఫ్ డిజైన్ తో లాంచ్ చేసింది.!
కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C61 ను విడుదల చేసింది
కేవలం రూ. 7,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల
ఈ ఫోన్ ను టఫ్ డిజైన్ మరియు ఫీచర్ లతో రియల్ మీ విడుదల చేసింది
రియల్ మీ ఈరోజు ఇండియాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C61 ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను టఫ్ డిజైన్ మరియు ఫీచర్ లతో రియల్ మీ విడుదల చేసింది. ఈ ఫోన్ ను ధర మరియు ఫీచర్లు వివరంగా తెలుసుకుందాం.
Realme C61: ప్రైస్
రియల్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో 4GB + 64GB బేసిక్ వేరియంట్ ను రూ. 7,699 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (4GB + 128GB) ను రూ. 8,499 ధరతో మరియు మూడవ వేరియంట్ (6GB + 128GB) ను రూ. 8,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart మరియు realme.com నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ సఫారీ గ్రీన్ మరియు మార్బుల్ బ్లాక్ రెండు కలర్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ పైన రూ. 900 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ప్రకటించింది.
Also Read: CMF Phone 1: అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ ఊపు పెంచిన నథింగ్ సబ్ బ్రాండ్.!
Realme C61: ఫీచర్లు
రియల్ మీ సి 61 స్మార్ట్ ఫోన్ ను బెండ్ రెసిస్టెంట్, డ్రాప్ రెసిస్టెంట్ మరియు స్క్రాచ్ రెసిస్టెంట్ కలిగిన ఆర్మోర్ షెల్ ప్రొటెక్షన్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం 7.84mm స్లిమ్ బాడీ తో నాజూకుగా కనిస్తుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే వుంది. రియల్ మీ సి 61 స్మార్ట్ ఫోన్ ను UNISOC T612 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దానికి జతగా 6GB ర్యామ్ మరియు డైనమిక్ ర్యామ్ ఫీచర్ 128GB స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 32MP మెయిన్ కెమెరా వుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ మరియు 10W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది.