Realme C55: బెస్ట్ అఫర్ తో మొదలైన ఫోన్ ప్రీ బుకింగ్..!
రియల్ మి ఇండియాలో కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Realme C55
Realme C55 యొక్క ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి
ఈ ఫోన్ ను Flipkart మరియు realme.com నుండి Pre-Book చేసుకోవచ్చు
రియల్ మి ఇండియాలో కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Realme C55 యొక్క ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. నిన్ననే ఇండియన్ మార్కెట్ లోకి లేటెస్ట్ గా అడుగుపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు మీరు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు మరియు మంచి డీల్ ను కూడా పొందవచ్చు. రియల్ మి యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Realme C55: ధర
రియల్ మి సి55 స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది.
1. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.10,999
1. 6GB + 64GB వేరియంట్ ధర: రూ.11,999
3. 8GB + 128GB వేరియంట్ ధర: రూ.13,999
ఈ స్మార్ ఫోన్ ప్రస్తుతం Pre-Book కి అందుబాటులో వుంది మరియు మార్చి 28 మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ముందుగా బుకింగ్ చేసుకునే వారికి 6 నెలల అదనపు వారంటీని లభిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ బుకింగ్ కోసం రూ.500 చెల్లిస్తే అది 1,000 రూపాయలుగా పరిగణింపబడుతుందని కూడా కంపెనీ తెలిపింది. అయితే, ఇది కేవలం బేసిక్ వేరియంట్ (4GB + 64GB) కు మాత్రమే వర్తిస్తుంది. అడ్వాన్స్ మరియు ఫుల్ పేమెంట్ లను ఒకే విధమైన పేమెంట్ పద్ధతిలో చేయవలసి ఉంటుందని కంపెనీ నొక్కి చెబుతోంది. ఈ ఫోన్ ను Flipkart మరియు realme.com నుండి Pre-Book చేసుకోవచ్చు.
Realme C55: స్పెక్స్
రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది.
కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.