Realme C55: మొదటి సారిగా సేల్ కి రానున్న రియల్ మి కొత్త ఫోన్.!
Realme C55 ఈరోజు మొదటి సారిగా సేల్ కి వస్తోంది
రియల్ మి ఇండియాలో ఇటీవల విడుదల చేసిన సరికొత్త స్మార్ట్ ఫోన్ Realme C55
ఈ స్మార్ట్ ఫోన్ 16GB వరకూ డైనమిక్ ర్యామ్ తో ఉంటుంది
రియల్ మి ఇండియాలో ఇటీవల విడుదల చేసిన సరికొత్త స్మార్ట్ ఫోన్ Realme C55 ఈరోజు మొదటి సారిగా సేల్ కి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ఐఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపించే కొత్త మినీ కాప్సూల్ ఫీచర్ తో అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 16GB వరకూ డైనమిక్ ర్యామ్, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈరోజు నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Realme C55: ధర
రియల్ మి సి55 స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB + 64GB) ధర రూ.10,999 కాగా, 6GB + 64GB వేరియంట్ ధర రూ.11,999 మరియు 8GB + 128GB వేరియంట్ ధర రూ.13,999. ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుండి లభిస్తుంది. ఈ ఫోన్ ను HDFC కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది.
Realme C55: స్పెక్స్
రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది.
కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.